DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్.బి.కె పరిధిలో అద్దె కై వ్యవసాయ యంత్ర పరికరాలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 07, 2020 (డిఎన్ఎస్):*  శ్రీకాకుళం జిల్లా రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాల కస్టమ్ హైరింగ్ సెంటర్లును అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకులు  కె.శ్రీధర్ తెలిపారు. రైతు భరోసా

కేంద్రాల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాల కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుపై వ్యవసాయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో శుక్ర వారం సమావేశం  జరిగింది. సంయుక్త వ్యవసాయ సంచాలకులు శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రములో వున్న ఎస్సి,ఎస్టీ, చిన్న,సన్నకారు, మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందుబాటులో వుండే

విధంగా చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలోని వేరు వేరు కుటుంబాలకు చెందిన అర్హత గల  5 లేదా 6 గురు చొప్పున ఎస్సి, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులు గ్రూపులుగా ఏర్పడి  రైతు భరోసా కేంద్రాలలో ఆగష్టు 15 లోపు నమోదు కావాలని కోరారు. నమోదు చేసుకున్న గ్రూపులలో రైతు భరోసా కేంద్రానికి ఒక గ్రూపు

చొప్పున ఆగష్టు 20వ తేదీ లోగా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సంబంధిత సహాయ వ్యవసాయ సంచాలకులు ఆధ్వర్యములో గ్రామ స్థాయి కమిటీ (మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన శాఖ  అధికారి, డి.సి.సి.బి బ్యాంకు అధికారి,  సంబంధిత సహాయ వ్యవసాయ సంచాలకులు గుర్తించిన రైతు భరోసా కేంద్రం లోని ఇద్దరు రైతులు) ఎంపిక చేస్తుందని తెలిపారు. ఒక్కో

గ్రూపు రూ.12 లక్షలు నుండి 15 లక్షల విలువల గల యంత్ర పరికరాలు కొనుగోలు చేయవచ్చని, ఆ మొత్తం విలువలో 40 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, 50 శాతం డి.సి.సి.బి బ్యాంకు రుణముగా మంజూరు చేస్తుందని, మిగిలిన 10 శాతంను రైతులు తమ వాటాగా  చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.  యంత్ర పరికరాలకు గ్రామస్థాయి కమిటీ నిర్ణయించిన అద్దె ప్రకారము

రైతులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చని చెప్పారు. బ్యాంకులో రుణ ప్రక్రియ, డీలరు లేదా కంపెనీల నుండి వ్యవసాయ పనిముట్ల సరఫరా ప్రక్రియ సెప్టెంబర్ 30 తేదీ నాటికి జరగాలని సమావేశంలో నిర్ణయించారు.
డి.సి.సి.బి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్య నారాయణ మాట్లడుతూ రైతు గ్రూపులకు 9 శాతం వడ్డీతో ఋణం మంజూరు చేస్తామని, గ్రూప్

సభ్యులు తమ వక్తిగత ఖాతాలను డి.సి.సి.బి బ్యాంకులలో ప్రారంభించాలని అన్నారు.
 ఈ కార్యక్రమములో వ్యవసాయశాఖ ఉప సంచాలకులు కె.రాబర్ట్ పాల్, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ ఏ.వి.ఎస్.వి జమదగ్ని, డి.సి.సి.బి జనరల్ మేనేజర్ డి.వర ప్రసాద్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, రైతు సభ్యులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam