DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాణిక్యాలరావు నిబద్దత, నిస్వార్థ బిజెపి ప్రతినిధి:బీజేపీ

*మాజీ మంత్రి కి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నేతల నివాళి*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 08, 2020 (డిఎన్ఎస్):* మాణిక్యాలరావు.. ఎంత ఎదిగినా.. తన నమ్మిన సిద్దాంతాల కోసం పని చేశారని, పూర్తి నిబద్దత, నిస్వార్థ నేత అని భారతీయ జనతా నేతలు తెలియచేసారు. శనివారం మాజీ మంత్రికి దేశ

వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అగ్రనేతలు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు.   మృదుస్వభావి... కోపం వచ్చినా.. వెంటనే.. మళ్లీ మాములు అయిపోయేవారని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. పని చేశారని, అభివృద్ది విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకుండా.. పని చేసేవారన్నారు. 1989

నుంచి బీజేపీ లోనే ఉంటూ.. పార్టీ అభివృద్ది కోసం పని చేశారని, ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ, పార్టీకి కూడా తీరని లోటన్నారు. 

పార్టీలో ఇటువంటి సంఘటన వస్తుందని కలలో కూడా ఊహించలేదని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. పార్టీలో నిబద్దత కోసం పని చేసిన నాయకుడు మాణిక్యాలరావని, తాడేపల్లి గూడెం నుంచి

ఎమ్మెల్యేగా ఎన్నికై, దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తూనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి గా బీజేపీ అభివృద్ది కోసం పని చేశారన్నారు. తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు, నియోజకవర్గ అభివృద్ది కోసం తపన పడుతుండేవారని తెలిపారు. మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిని సైతం ఎదిరించి అమిత్ షా సహకారంతో నిట్ ను తన నియోజకవర్గంలో

కేటాయించుకున్నారు. దేవాలయాల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. నేను అధ్యక్షునిగా ఉన్న సమయంలో.. ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కాదనకుండా పని చేశారని, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికల బాధ్యతలను పూర్తి చేశారన్నారు. 

మాణిక్యాలరావు వంటి మంచి మనిషిని పార్టీ

కోల్పోవడం బాధాకరం అని, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. నాకు ఎంతో ఆత్మీయుడు.. ఎన్నో విషయాలను చర్చించకున్నాం అన్నారు. పార్టీ పట్ల నిబద్దత.. విలువలను పాటిస్తూ పని చేసి నాయకులు అరుదుగా ఉన్నారన్నారు. చివరి సారిగా ఆయన కలిసిన సమయంలో కూడా రాజకీయ అంశాలపై చర్చించాం అని తెలిపారు. మంత్రి స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ సామాన్య

కార్యకర్తగానే పార్టీలో పని చేశారన్నారు. 

ఎపీలో అనేక ఆటుపోటులు ఎదుర్కొని మాణిక్యాలరావు  బీజేపీ కోసం పని చేశారని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. మంత్రి పదవి కన్నా విలువలే మఖ్యమని, రాజీనామాకు కూడా సిద్దమని ప్రకటించిన నాయకులు తెలిపారు. బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలా అని చెప్పేందుకు

మాణిక్యాలరావు జీవితాన్ని ఉదహరించాలన్నారు. పార్టీ కోసం పని చేస్తూ ఆదర్శంగా నిలిచేలా ఆయన పని చేశారని తెలిపారు. బీజేపీ కేంద్ర పార్టీ మాణిక్యాలరావుకు ఇచ్చిన కానుక NIT అని నేను భావిస్తున్నానన్నారు. బీజేపీ ని ఎపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేశారు.

మాణిక్యాలరావు.. పార్టీలో కీలకపాత్ర, చురకైన

పాత్ర పోషించే వారని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వర్చ్యువల్ విధానం ద్వారా కార్యక్రమం జరుపుకోవాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. జిల్లా,రాష్ట్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తూ... క్రమశిక్షణకు ప్రతిబింబగా మాణిక్యాలరావు నిలిచారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా.. నేను వైద్యులతో మాట్లాడి ఆరా తీశాను.

ఎలా అయినా ఆయన్ను కాపాడేందుకు కృషి చేయాండి.. అన్నివిధాలా మేము అండగా ఉంటామని వైద్యులకు చెప్పాను, కానీ దురదృష్టవశాత్తు ఆయన మన నుంచి దూరమవడం బాధ కలిగించిందన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ది జరుగుతుందని మాణిక్యాలరావు చెబుతుండే వారని, మాణిక్యాలరావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా

తీసుకోవాలన్నారు. 

విజయవాడ కార్యాలయంలో జరిగిన పైడికోండల మాణిక్యాలరావు సంతాపసభ రాష్ట్ర ఇంచార్జి,. సునిల్ డియేదర్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యమూర్థిగారు పాల్గోన్నారు. వివిదప్రాంతాలనుంచి వీడియో ద్వారా  ఆర్ యస్ యస్ జాతీయనేత భాగయ్య, జీవియల్ నర్సింహారావు, పురందరీశ్వరీ , మాదవ్ తదితరులు పాల్గొని నివాళులు

అర్పించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam