DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రైవేట్ సేవలకు ప్రభుత్వం దాసోహం, వాళ్లపై పట్టు కోల్పోయింది

*ఆసుపత్రుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు.*

*కోవిడ్ కేంద్రంలో ప్రమాదం పై పార్టీల మండిపాటు* 

*ఆసుపత్రుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం : సోము వీర్రాజు*
 
*కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయవిదారకం: పవన్ కళ్యాణ్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 09, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల సేవలకు వాళ్లపై పట్టు కోల్పోయి, వాళ్లకు ప్రభుత్వం దాసోహం అంటోందని, దాని ఫలితంగా  ప్రజలు ప్రాణాలు కోల్పోతూ భారీ ప్రాణ నష్టం చవిచూడాల్సివచ్చిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుఝామున 4 :30 గంటలకు విజయవాడ

లోని స్వర్ణ పాలస్ హోటల్ ( రమేష్ ఆసుపత్రి దీన్ని కోవిడ్ కేంద్రంగా తీసుకుంది) లో జగిరినా షార్ట్ సర్క్యూట్ కారణంగా  భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 మంది అమాయకులు ప్రాణాలు కొల్పినట్టు సమాచారం. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్లక్ష్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఆసుపత్రుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం

: సోము వీర్రాజు 

ప్రయివేట్ ఆసుపత్రులు కేవలం ధర్నార్జనే లక్ష్యంగా ప్రజలతో వ్యాపారాలు చేస్తున్నాయని, వారి నిర్లక్ష్యానికి ఎందరో బలవుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడ ఘటన కూడా ఈ తరహా ఘటనే అన్నారు. కోవిడ్ కేంద్రం గా తీసుకున్నప్పుడు ప్రభుత్వం అనుమతులు ఎలా

ఇచ్చిందన్నారు. తగిన రక్షణ సదుపాయాలు చూడకుండా అనుమతులు ఇచ్చేస్తే ఇలాగ పరిణామం చవిచూడాల్సివస్తుందన్నారు. 

కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయవిదారకం: పవన్ కళ్యాణ్ 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర

దిగ్భ్రాంతికి లోనైనట్టు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.  కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని, .

గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 

రమేశ్ హాస్పిటల్స్ కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు

ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 24, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam