DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిలోఫర్ లో  రూ. 2.5 కోట్ల ఫుడ్ స్కాం నిందితునికే విశాఖ మెంటల్ ఆసుపత్రి కాంట్రాక్టు? 

*నీలోఫర్ డైట్ లో అక్రమాల పై 17 లోగ నివేదిక ఇవ్వాలి: హైకోర్టు* 

*సురేష్ ఇతర ఫుడ్ కాంట్రాక్టు లపైనా విచారణ జరపాలి: హై కోర్టు 

*ఇతని కేసులో తెలంగాణ ప్రభుత్వానికీ కోర్టు మొట్టికాయలు.*

*విశాఖ మెంటల్ ఆసుపత్రిలోనూ ఇతనికే కాంట్రాక్టు దాదాపు ఖరారు?*

*ఒక ఆసుపత్రిలో అక్రమాల్లో

దోషిగా వున్న వ్యక్తికే మరో చోట కూడా అవకాశమా?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 10, 2020 (డిఎన్ఎస్):* హైదరాబాద్ లోని చిన్న పిల్లల ఆసుపత్రి నీలోఫర్ ఆసుపత్రిలో ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ సురేష్ కుమార్ పై రూ. 2.5 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలంగాణ హై కోర్టు

లో పిల్ వేయడం జరిగింది. దీనిపై విచారణ జరిగిపిన కమిటీ నివేదికను ఐదు నెలల క్రితం అందించింది. దీనిపై స్పందించిన  తెలంగాణ హైకోర్టు సురేష్ కుమార్ ను ఎందుకు కాపాడుతున్నట్టో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయ వేసింది. అయితే దీన్ని ఈనెల 17 లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

ఈ కేసులో

నిందితునిగా ఉన్న సురేష్ కుమార్ అనే ఫుడ్ కాంట్రాక్టర్ కే విశాఖపట్నం లోని మానసిక చికిత్స ( మెంటల్) ఆసుపత్రిలోని రోగులకు ఇచ్చే ఆహారపు కాంట్రాక్టు ను కూడా కట్టబెట్టేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. 

నీలోఫర్ ఆసుపత్రి ప్రసూతి ఆసుపత్రి, అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి, వివిధ సమస్యలతో చికిత్సకు వచ్చే

పిల్లలు, తల్లులు నిత్యం రద్దీగానే ఉంటుంది. పిల్లలు ఉన్న ఆసుపత్రిలో ఎంతో బాధ్యతతో అందించిన వలసిన ఆహారం లో ఎన్నో లోటుపాట్లు, తో భారీ కుంభకోణానికి పాల్పడడంపై హైకోర్టు లో కొందరు వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దానిపై ఐదునెలల క్రితం విచారణ కూడా ముగిసింది. అయితే నేటికీ దీన్ని అమలు చెయ్యక పోవడం తో హైకోర్టు సీరియస్

అయ్యింది. ఈ కాంట్రాక్టర్ పై ఎందుకు వెనక వేసుకొస్తున్నారంటూ అధికారులకు మొట్టికాయలు వేసింది. ఈ కుంభకోణం కనీసం లో  రూ. 2.5  కోట్లు కు పైగా ఉంటుందని అభియోగం ఉంది. 

ఈ భారీ అభియోగం ఎదుర్కొంటున్న ఇదే కాంట్రాక్టర్ సురేష్ కుమార్ కు విశాఖనగరం లోని మెంటల్ ఆసుపత్రి లో ఫుడ్ కాంట్రాక్టు ఇవ్వడం ఏంటని పలువురు

ప్రశ్నిస్తున్నారు. ఇప్పడికే ఇతని పనితనం పై ప్రక్క రాష్ట్రం హైకోర్టు సీరియస్ అయినప్పటికీ విశాఖ జిల్లా అధికారులు ఇతనికి ఫుడ్ కాంట్రాక్టు ను ఒకే చెయ్యడం వెనుక ఆసక్తి ఎంతో తెలియాల్సి ఉంది. సాధారణంగా టెండర్ వేసిన వ్యక్తి పై అభియోగాలు ఉంటె అతని దరఖాస్తు ను నిలిపి వేయడం జరుగుతుంది. అయితే విశాఖ లో ఈ విధమైన ప్రయత్నం

జరిగినట్టుగా కనపడడం లేదు. ఇతనితో పాటు టెండర్ వేసిన మరో వ్యక్తితో కలిపి చెరొక ఏడాది ఈ కాంట్రాక్టు ను పంచుకునే విధంగా కూడా ఫైళ్లు కదులుతున్నట్టు తెలుస్తోంది.  

 

(pix coutesy TOI clippings)

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam