DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2019 ఐఏఎస్ విజేతల్లో ఎందరో స్ఫూర్తిదాతలు, ఎన్నో కన్నీటి గాధలు 

*పెట్రోల్ బంక్ ఉద్యోగి కొడుకు అతి చిన్న వయస్సు కే ఐఏఎస్* 

*మోడలింగ్ రంగం నుంచి మహోన్నత ఉద్యోగానికి ఎంపిక. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* 2019 బ్యాచ్ ఐఏఎస్ విజేతల్లో వివిధ వర్గాలకు చెందిన వారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకరు

మోడలింగ్ రంగం నుంచి, మరొకరు నిరుపేద వర్గం నుంచి, మరొకరు దివ్యజ్ఞానులు ఇలా ఎందరో విజేతలు. ఉన్నారు. 

గత ఏడాది (2019 ) సంవత్సరానికి జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యు పి ఎస్ సి) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో  మొత్తం 829 మంది అభ్యర్థులను ఉత్తీర్ణులుగా ఎంపిక చేసి ప్రకటించింది కేంద్ర కమిటీ. వీరిలో

150 మంది మహిళలు ఉండడం హర్షణీయం. ఒక్కొక్క విజేత విజయ పథం అందరికీ స్ఫూర్తి దాయకం. 

ఈ దేశం లో విద్యార్థి దశలో చాలామందికి ఉండే కల ఐఏఎస్. . . అత్యున్నత అధికారం కల్గిన ప్రభుత్వ ఉద్యోగం. దీన్ని సాధించడం అంత ఆషామాషీ కాదు. ఎంతో ఉన్నత ఆశయం ఉండాలి, పట్టుదల ఉండాలి, కష్టపడి చదవగలిగి ఉండాలి. అన్నీ ఉన్నా అదృష్టం ఉండాలి. అది

కూడా కలిసి వచ్చినా ఆపై రిజర్వేషన్లు అనే అవరోధం కూడా దాటుకు వెళ్తేనే ఒక ఓసీ విద్యార్థి ఐఏఎస్ గా ఉత్తీర్ణులు కాగలరు. 

వీరిలో ఒక ఆర్ధికంగా స్థితిమంతులు ఉన్నారు, పరీక్ష ఫీజుకు, శిక్షణకు ఫీజు కట్టడానికి ఉన్న ఇల్లు అమ్ముకున్నవాళ్లూ ఉన్నారు. వీరితో పాటు గా గట్టి పోటీ ఇచ్చి మరీ విజేతలుగా నిలిచినా

దివ్యజ్ఞానులు కూడా ఉన్నారు. ఈ విజేతల్లో ఈ ముగ్గురి గురించి. . . .

పెట్రోల్ బంక్ ఉద్యోగి కొడుకు అతి చిన్న వయస్సు కే ఐఏఎస్ 

మధ్య ప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ళ ప్రతీప్ సింగ్ జాతీయ స్థాయిలో 22 వ రాంక్ సాధించారు. ఈ ఏడాది విజేతల్లో ఈయనే అతి చిన్న వయస్కుడు. ఈయన తండ్రి ఒక పెట్రోల్ బంక్ లో సాధారణ ఉద్యోగి, ఇతని శిక్షణ

 కోసం తాము ఉంటున్న ఇల్లు అమ్మి ఢిల్లీకి పంపడం జరిగింది. కుటుంబ సభ్యుల ఆశయాలను నిజం చేస్తూ జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన ప్రతీప్ విజయంతో కుటుంబ సభ్యులు ఇంతకాలం తాము పడ్డ కష్ఠాలను ఆనందబాష్పాలుగా ప్రకటిస్తున్నారు.

మిస్ ఇండియా స్టేజి నుంచి. .క్యాట్ ఎంపికై. . . 

అందమైన ఆకృతి, శరీర సౌష్టవం

కల్గిన యువతులు ఎక్కువగా మోజు పడే రంగం మోడలింగ్ రంగం. అందులో ఇంకా ప్రాధాన్యత ఇచ్చే పోటీలు మిస్ ఇండియా పోటీలు. గతంలో మిస్ ఇండియా పోటీలకు వెళ్లే వారు ఇతర రంగాల్లో ఆసక్తి చూపేవారు కాదు, పైగా అత్యంత గ్లామర్ రంగమైన సినీ రంగానికి వెళ్లేవారు. అయితే 2019 ఐఏఎస్ విజేతల్లో అత్యంత ఆసక్తి కరంగా మిస్ ఇండియా 2016 పోటీల ఫైనల్ లో టాప్ 10 లో

నిలిచిన ఐశ్వర్య షియోరన్ ఉన్నారు. 

ఈమె ఒక భారత ఆర్మీ అధికారి కుమార్తె. మోడలింగ్ పై ఆసక్తి తో మోడలింగ్, ఆపై మిస్ ఇండియా పోటీలకు సైతం ఎంపికయ్యారు. విద్య లోనూ ఈమె మేటి.  ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజిమెంట్ ( ఐఐఎం) లో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ పరీక్షల్లో తావు లో నిలిచారు. అయితే సివి ల్సు కోసం ఈ సీటు

వదులుకోవడం జరిగింది. కఠోర శ్రద్ధతో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ 2019 పరీక్షలో తోలి ప్రయత్నంలోనే 93 వ రాంక్ సాధించారు. 

దివ్యజ్ఞాని . .పురాణం సుంతరి     . .

మదురై కు చెందిన పురాణం సుంతరి దివ్య జ్ఞానీ, 25 ఏళ్ల ఈమె తన నాల్గవ ప్రయత్నంలో 286 వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది, ఇప్పుడు చంద్రునిపై ఉంది” అని ఆమె

చెప్పారు. దృష్టి లోపం ఉన్న కారణంగా పుస్తకాలూ నేరుగా చదవలేని పరిస్థితి. తల్లిదండ్రులు పుస్తకం చదివితే. . విని అవలోకనం చేసుకుని మెదడు లో భద్రపరుచుకోవడమే తప్ప నోట్సు రాసుకునే అవకాశం కూడా లేదు. ఈమె స్నేహితులు, పుస్తక రూపం లో ఉన్న అంశాలను ఆడియో రూపం లోకి మార్చి, ఈమెకు వినిపించేవారు. 

ఈ విజయం తన కుటుంబసభ్యులు,

స్నేహితులదేనన్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు గ్రామ బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తున్నారు.

వీరితో పాటు అర్చక, బ్రాహ్మణా కుటుంబాలనుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఎందరో విజేతలు యావత్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. అందరికీ హార్దిక శుభాకాంక్షలు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam