DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా వ్యతిరేక వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదు: ఏలూరు డిఐజి 

*కొందరి స్వార్ధానికి సహకరిస్తే చర్యలు తప్పవు: కెవి మోహన్ రావు* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహింద్రవరం  అర్బన్ జిల్లా పరిధిలో సీతానగరం పోలీస్ స్టేషన్ లో జరిగిన   శిరో మండనము  దుశ్చర్యల  సంఘటనపై రాష్ట్ర డిజిపి గౌతమ్

సవాంగ్ ఆదేశాలపై దోషులపై చర్యలు తీసుకున్నట్టు ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు తెలిపారు. మంగళవారం ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయము లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ స్వలాభం కొరకు ఇలాంటి అమాయకులను అడ్డం పెట్టుకుని చేపట్టే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు

తీసుకుంటామని ఏలూరు డిఐజి కెవి మోహన్ రావు హెచ్చరించారు. ఆ సంఘటనకు పాల్పడిన సీతానగరం పి.యస్. ఎస్ ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పై ఎస్సీ, ఎస్టీ .అట్రాసిటీ. యాక్ట్ ప్రకారం కేసు నమోదు పరిచి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. 

ఈ కేసులో ఫిర్యాదుదారునికి తగిన రక్షణ కొరకు ఏర్పాట్లన్నీ పోలీసు వారి తరఫున కల్పించి

సదరు గ్రామములో పికేటు ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సమానులే అనే సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ ఘటన లో చర్యలు తీసుకున్నామన్నారు.  

కొంతమంది రాజకీయ ప్రముఖులు ఇటువంటి సంఘటనలను అడ్డం పెట్టుకొని తమ యొక్క ఉనికిని చాటుకునే నిమిత్తము గా అమాయకుల చేత నక్సలైట్ లో చేరతాం అని తెలియజేయడం

ప్రభుత్వ వ్యతిరేకమన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న ఈ తరహా సంస్థలను ప్రభుత్వం బహిష్కరించిందని, వాటిల్లో చేరుతామని బెదిరించడం తప్పుడు సంకేతాన్ని ఇస్తోందన్నారు. దీనికి కారణమైన వారిపైనా, సహకరించిన వారిపైనా, ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

భారత  రాజ్యాంగ పరిధిలో

ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, స్వతంత్రం, వాక్ స్వాతంత్రం, సమాన హక్కుల ను దుర్వినియోగం చేసుకోకుండా చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని డిఐజి ప్రకటించారు. 

ఈ పత్రికా సమావేశం  లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె.నారాయణ్ నాయక్ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam