DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళంలో ప్లాస్మా థెరాఫీ ప్రారంభం, ఇద్దరు యువకుల తోలి అడుగు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 12, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, ఆగష్టు 12 : జిల్లాలో ప్లాస్మా థెరాఫీ ప్రారంభం అయింది. ఆదర్శప్రాయమైన ఇద్దరు యువకులు ప్రశాంత్, కృష్ణ వంశి ప్లాస్మా దానంతో నాంది పలికారు. ప్రశాంత దానం చేసిన ప్లాస్మాను మంగళ వారం రాత్రి 2.30 గంటలకు

జెమ్స్ లో అత్యవసర చికిత్స పొందుతున్న 56 సంవత్సరాల వయస్సుగల కరోనా బాధితునికి ప్రాణాపాయం నుండి కాపాడారు. కృష్ణ వంశి బుధ వారం ఉదయం దానం చేయగా దానిని కూడా జెమ్స్ ఆసుపత్రికి అందజేయగా అదే వ్యక్తికి దీనిని కూడా ఉపయోగించడం జరిగింది. ఈ సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇద్దరు యువకులను అభిందించారు. రియల్ హీరోలుగా

ప్రశంసించారు. 
    కరోనా నుండి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసి కరోనాతో పోరాటం చేస్తున్న వ్యక్తుల ప్రాణాలను కాపాడాలని  జిల్లా కలెక్టర్ నివాస్ పిలుపు మేరకు  స్పందించారు ఈ ఇద్దరు యువకులు. వివరాలు పరిశీలిస్తే పలాస మండలానికి చెందిన యువకుడు ప్రశాంత్ తన 5 గురు కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోగల ఇండియన్

రెడ్ క్రాస్  బ్లడ్ బ్యాంకుకు మంగళ వారం సాయంత్రం వచ్చారు. ఇమ్యునోగ్లోబులిన్ (IgG), ప్లేట్లెట్స్ తదితర పరీక్షలు చేయించుకున్నారు. అందులో ప్రశాంత ఒక్కరే అర్హత సాధించి మంగళవారం రాత్రి ప్లాస్మా దానం చేసారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జెమ్స్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులలో ఉన్న కరోనా భాదితునికి ప్లాస్మా

ఎక్కించటంతో ప్రాణాపాయం తప్పింది. 
    ఎచ్చెర్లలో గల శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల మేనేజింగ్ డైరక్టర్ బి.వి.ఎస్.ఎన్. మూర్తి కుమారుడు బెండి కృష్ణ వంశీ బుధ వారం ఉదయం లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంకులో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన రావు  సమక్షంలో  ప్లాస్మా దానం  చేసారు. దీనిని కూడా జెమ్స్ ఆసుపత్రికి అందజేయడం

జరిగింది. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ ప్లాస్మా దానం చేసిన యువకులకు ఫోన్ లో అభినందనలు తెలిపారు. ప్రశాంత్, వంశీలు ప్లాస్మా దానం చేసి జిల్లాలో ప్లాస్మా థెరాఫీకి శ్రీకారం చుట్టడం జరిగిందని, మరింత మంది స్ఫూర్తితో ముందుకు రాగలరని ఆయన కోరారు. ప్రశాంత, వంశీ ఇద్దరూ ఆదర్శనీయమని అన్నారు. కరోనా చికిత్స పొందున్న

వ్యక్తులు మన స్నేహితులు, మన బంధువులేనని, వారి ప్రాణాలు కాపాడుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నుండి కోలుకున్న 28 రోజుల తరువాత ఒక వ్యక్తి ప్లాస్మా దానం చేయవచ్చన్నారు. 28 రోజుల తరువాత ఆ వ్యక్తిలో ఏంటీ బాడీలు తయారు అవుతాయని చెప్పారు. కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం వలన చికిత్స పొందుతున్న వ్యక్తులకు

సహాయకారిగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాస్మాదానం చేసిన వారికి ప్రభుత్వం కూడా రూ. 5000 కానుకగా ఇస్తుందని తెలిపారు. దూరప్రాంతాల నుండి ప్లాస్మా దానం చేయుటకు వచ్చే వారికి  ప్రయాణ ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  
రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా ఛైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ ప్లాస్మా

మన శరీరంలో పసుపు రంగులో ఉన్న నీరు లాంటిదని,  దీనిని దానం చేయడం వలన నీరసం కాని అనారోగ్యం కాని రాదన్నారు.  ప్లాస్మా దానం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా బాధితులకు ఎక్కించడం వలన ప్రాణాన్ని నిలబెట్టవచ్చని  పేర్కొన్నారు.  కావున కోవిడ్ నుండి కోలుకున్న 18 నుండి 50 సం.ల వయసు గలవారు ముందుకు రావలసినదిగా తెలియ చేసారు. 18

సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు, 50 కిలోలకు పైగా బరువు గల వ్యక్తులు ఇందుకు ఉపయోగకరంగా ఉంటారని చెప్పారు. హెమోగ్లోబిన్ 12 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలని, ప్లేట్ లెట్స్ 1.50 లక్షల కంటే ఎక్కువగా ఉండాలని ఆయన తెలిపారు. రోగ నిరోధక శక్తి (ఐజి) 11 పాయింట్ల కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు. ఒక వ్యక్తి నుండి 4 వందల మిల్లీ గ్రాముల

రక్తాన్ని సేకరిస్తే 2 వందల నుండి 220 మిల్లీ గ్రాముల వరకు ప్లాస్మా లభ్యం అవుతుందని ఆయన వివరించారు. 
ప్లాస్మా దాతలు ప్రశాంత్, వంశీకృష్ణ మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని కాపాడామనే భావన ఎంతో గొప్పగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ప్లాస్మా దానం చేయాలనే పిలుపును మీడియా ద్వారా తెలుసుకున్నామని, ప్రాణదానం అన్ని దానాలలోకి గొప్పదని,

ఆత్మసంతృప్తి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ జి.ఆర్. శ్రీకాంత్, లయన్స్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam