DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం కలెక్టర్ పర్యవేక్షణలో అద్భుతం, బెవర మోహనరావు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం లోని జెమ్సు ఆసుపత్రిలో కోవిడ్ పేషంట్లకు అందిస్తున్న వైద్యం, పేషంట్లపై చూపుతున్న  శ్రద్ద ఎనలేనివని ఇందుకు వైద్యులకు కృతజ్ఞతలని  కోవిడ్ నుండి కోలుకున్న  బెవర మోహనరావు తన మనోగతాన్ని తెలిపారు. వైద్యుల సేవలు

ఎనలేనివని, జిల్లా కలెక్టర్ జె నివాస్ పర్యవేక్షణ అద్భుతమని కొనియాడారు. జెమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందిన బెవర మోహన రావు (48) కోలుకుని ఆరోగ్యవంతుడిగా గురువారం డిశ్చార్జ్ అయ్యారు. హిరమండలం మండలం గులుమురు గ్రామానికి చెందిన మోహనరావు హైదరాబాద్ నుండి గత నెల సత్యసాయి సేవా కార్యక్రమాల పనిమీద జిల్లాకు వచ్చాడు. పొరుగు

రాష్ట్రం నుండి రావడంతో కోవిడ్ టెస్టులు నిర్వహించగా అతనికి పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కోవిడ్ ఆసుపత్రి అయిన జెమ్స్ లో చేరాడు. అయితే తనకు సరైన చికిత్స అందడం లేదని పేర్కొంటూ గత నెల 19న వాట్సప్ ద్వారా పంపించిన సందేశంపై జిల్లా కలెక్టర్  నివాస్ తక్షణం స్పందించి జెమ్స్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా.హేమంత్, వైద్యులతో

వెంటనే మాట్లాడి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. మోహన రావు పరిస్ధితిని నిరంతరం గమనించాలని అందుకు ప్రత్యేకంగా ఒక వైద్యులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులు స్పందించి ఐ.సి.యులో ఉన్న మోహన రావుకు తక్షణం చికిత్సను అందించారు.  మోహన రావు  ఊపిరి తీసుకునే సమయంలో ఇబ్బంది పడటంతో ఊపిరితిత్తుల్లో

ఇన్ఫెక్షన్ ఉందని గమనించి దానిని తగ్గించుటకు ఇంజెక్షన్ ఇచ్చారు. పౌష్టిక  ఆహారాన్ని అందిస్తూ, ధైర్యంగా ఉండాలని,  ధైర్యంగా ఉంటే కరోనా ఏమి చేయదనే  ఆత్మస్ధైర్యాన్ని వైద్యులు అందించారు. ప్రస్తుతం కరోనా నెగిటివ్ రాడంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు మోహనరావు వెల్లడించారు. జెమ్స్ ఆసుపత్రి వైద్యులు  పేషెంట్లకు

మంచి వైద్య సేవలు అందించుటకు శాయశక్తుల కృషి చేస్తున్నారని, ఇందుకు వైద్యులకు, జిల్లా కలెక్టర్ నివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ ఆయిన తరువాత కూడా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు మోహనరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొని వీడ్కోలు పలికారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam