DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ విజేతలకు ప్రోత్సాహక జ్ఞాపికల బహూకరణ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 15, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని కుదేపేస్తున్న కోవిడ్ మహమ్మారి నుండి కోలుకుని విజయవంతంగా బయటకు వచ్చిన విజేతలకు శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జ్ఞాపికలను బహూకరించారు. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ పురుషుల

కళాశాలలో శని వారం నిర్వహించిన 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్ సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు విజేతలకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

విజేతలలో సామాన్య ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వైద్యులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. కోవిడ్ అంటే భయం అవసరం లేదు మనోధైర్యం, ఆత్మ నిబ్బరం ఉంటే చాలు అనే స్పూర్తిని కలిగించిన వృద్ధులు, గర్భిణీ మహిళలు ఉండటం విశేషం. భయపడితేనే చంపుతుందని, ఆత్మస్థైర్యం ఉంటే ఏమి చేయదని నిరూపించారు.

కరోనా విజేతలలో జ్ఞాపికలు బహూకరించుటకు వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, వైద్యులు, పోలీసు తదితర రంగాల నుండి కొంత మందిని ఎంపిక చేసారు. 291 మందిని స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనుటకు ఆహ్వానించారు. జ్ఞాపికలు పొందిన వారిలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, రాజకీయ నాయకులు దువ్వాడ

శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,  కలెక్టర్ కార్యాలయ పారిపాలన అధికారి బి.రాజేశ్వరరావు, పోలీసు అధికారి డి.ఎస్.పి డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి,  ఇన్స్పెక్టర్ హెచ్.మల్లేశ్వరరావుతో సహా పలువురు ప్రజలు జ్ఞాపికలు అందుకోగా గర్భిణీగా చేరి సుఖప్రసవంతో బిడ్డతో సహా సంతోషంగా ఇంటికి చేరిన మెరగాన జ్యోత్స్న,

గొట్టిపల్లి అనురాధ ఉండగా, వృద్ధులు కె. అప్పల నరసింహులు, మెండా లచ్చయ్య, పెదపూడి వెంకట్రావు ఉన్నారు. పోలీస్ శాఖలో కాశీబుగ్గ పోలీస్ కానిస్టేబుల్ కే.శేఖర్ రావు, మెళియాపుట్టి పోలీసు కానిస్టేబుల్ ఏ.శ్రీనివాస రావు, ఎచ్చెర్ల డి.ఎ.ఆర్ కానిస్టేబుల్స్ జి.సూర్యనారాయణ, సంపతిరావు అప్పారావు, పి. మాధవరావు, కరిమి గరయ్య,  బూర్జ

పోలీసు కానిస్టేబుల్ లుట్టా అప్పారావు, ఇచ్చాపురం పోలీసు కానిస్టేబుల్ బేసి రామారావు, సారవకోట పోలీసు కానిస్టేబుల్ మెట్టా సత్యం, రాజాం పోలీసు కానిస్టేబుల్ పైడి రామకృష్ణ ఉన్నారు. డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.నగేష్, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ సునీల్ నాయక్,  డాక్టర్ ఎస్. పద్మావతి, డాక్టర్ కె.కృష్ణ కుమార్,

ఎంపిహెచ్ఇఓ కె.ధర్మారావు, పి.హెచ్.ఎన్ వి.భాగ్యవేణి, అంపోలు ఎ.ఎన్.ఎం వై.ప్రభావతి, స్టాఫ్ నర్స్ వై.ఎస్ రామలక్ష్మి, ఆశా కార్యకర్త పద్మ., జిల్లా పరిషత్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఆమదాలవలస మండలం రామచంద్రాపురం వ్యవసాయ సహాయకులు ఏ.రోహిత్ కుమారా, చింతలపేట డిజిటల్ అసిస్టెంట్ పిట్టా ఈశ్వరరావు, శ్రీకాకుళం మండలం గూడెం విలేజ్

సర్వే సహాయకులు డి.జ్ఞానసాగరిక, అలికాం పంచాయతీ కార్యదర్శి ఎం. శ్యామ సుందర్ రావు, ఎస్.ఎస్.వలస వ్యవసాయ సహాయకులు ఏ.లోకేశ్వరరావు, అంపోలు మహిళా ప్రొటేక్షన్ కార్యదర్శులు ఇప్పిలి సాయి శిల్ప, జల్లా శ్రీదేవి., శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఇంజనీర్ ఎస్.వెంకటి, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కె.వి.రమణమూర్తి,

జూనియర్ అసిస్టెంట్లు ఎస్. చిద్విలాస్ గుప్తా, లోవ శ్రీనివాస రావు ఉన్నారు. 
కోవిడ్ మృతదేహాల సేవకులకు గుర్తింపు : కోవిడ్ మృతదేహాల సేవకులుగా గుర్తింపు పొందిన భూసి శ్రీనివాస రావు, మైలపల్లి కృపానంద్ కు కోవిడ్ విజేతల జ్ఞాపికలను అందజేసారు. కోవిడ్ తో మృతి చెందుతున్న వారి దహన సంస్కారాలను నిర్వహించుటకు కుటుంబ సభ్యులు

సైతం దూరంగా ఉంటున్న సమయంల శ్రీనివాస రావు, కృపానంద్ బృందం చేస్తున్న సేవలు అపారం. ఈ సేవలకు గుర్తింపుగా జ్ఞాపికలను మంత్రి బహూకరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam