DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమ్ స్ ఆసుపత్రిలో  సేవలు విస్తరణ: కలక్టరు వినయ్ చంద్

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 17, 2020 (డిఎన్ఎస్):*  విమ్స్ ఆసుపత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరువి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన విమ్స్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర వైద్యాధికారులతో

 సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి పనితీరుపై సమీక్షించారు. వార్డులను సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా పరిశీలించారు.   భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.   ప్రస్తుతం అందజేస్తున్న సేవలు, వసతులను మరింత మెరుగు పరచుకోవాలన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి

స్థాయిలో వినియోగించు కోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు.    ఆసుపత్రికి వచ్చిన  పేషెంటు ఆరోగ్య పరిస్థితిని  తక్షణం పరీక్షించి, చికిత్సను  నిర్దారించాలన్నారు. 

 ఈ  సమావేశంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి వి సుధాకర్, విమ్స్ డైరెక్టరు

సత్యవరప్రసాద్, నోడల్ అధికారి ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ,  ఓ ఎస్ డి డా. వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam