DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభమైతే, ప్రణాళిక రెడీ 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 22, 2020 (డిఎన్ఎస్):*  అమరావతి: 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌

రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్‌ ప్రకారం ... వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో 21 రోజులు, నవంబరులో 24 రోజులు, డిసెంబరులో 25/22 రోజులు, జనవరిలో 20/23 రోజులు,

ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి.

మొత్తం మీద 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.

పరీక్షల ప్రణాళిక:
నిర్మాణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు అక్టోబరులో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో, నిర్మాణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు మార్చిలో, సంగ్రహణాత్మక

మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయి.

సెలవుల ప్రణాళిక:
దసరా 2.10.2020-26.10.2020, క్రిస్టమస్‌ 24.12.2020-28.12.2020, సంక్రాంతి 12.01.2021- 17.01.2021, వేసవిసెలవులు 24.04.2021-11.06.2021

కాలనిర్ణయ పట్టిక: 1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్‌లు ఉంటాయి.

కాగా,

ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-3, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-4, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam