DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి అదుపునకై ఐఐఎం నిపుణుల నివేదిక సిద్ధం 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 24, 2020 (డిఎన్ఎస్):* – అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. 14400 కాల్‌సెంటర్, కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్‌ నివేదిక, రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ తదితర అంశాలపై

సమగ్రంగా సమీక్షించిన ముఖ్యమంత్రి. ఈ సమవేశంలో ఐఐఎం అహమ్మదాబాద్ కు చెందిన నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. 

అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్ పై నివేదిక ను ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్‌ ఐఐఎం
ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణ స్వామి

సమర్పించారు. 
– ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్న సీఎం.
– ఎమ్మార్వో కార్యాలయాలు, ఎండీఓ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు,

బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఏసీబీ కాల్‌ సెంటర్‌ 14400  పని తీరుపై సీఎం సమీక్ష
గత ఏడాది నవంబరులో 14400 కాల్‌ సెంటర్‌ ప్రారంభం
ఇప్పటి వరకు 44,999 కాల్స్‌ వచ్చాయని వెల్లడించిన ఏసీబీ
ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1747
/> పరిష్కరించిన అంశాలు 1712
161 కాల్స్‌ విషయంలో చర్యలు తీసుకుంటున్నామన్న ఏసీబీ
35 కాల్స్‌ పెండింగులో ఉన్నాయని వివరించిన ఏసీబీ

1902 నెంబర్‌ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి: సీఎం
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి: సీఎం
వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్‌

చేసే వ్యవస్థ బలంగా ఉండాలి:
1902కు వచ్చే కాల్స్‌పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలి:
– దీనికి కలెక్టర్‌ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి:
– టౌన్‌ ప్లానింగ్, సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ, టౌన్‌ ప్లానింగ్‌  కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు:

కర్నూలుజిల్లా పిన్నాపురం విద్యుత్‌

ప్రాజెక్టు:
– గత ప్రభుత్వ హయాంలో 2018, జులైలో ఒప్పందం కదుర్చుకున్నారు:
– 4,766.28 ఎకరాల భూమిని ఇచ్చారు:
– అప్పటి ప్రభుత్వంలో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే:
– మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కంపెనీతో తిరిగి సంప్రదింపులు జరిపింది:
– అవే స్పెసిఫికేషన్లతో విద్యుత్‌ ప్రాజెక్టు ఆ కంపెనీ

నిర్మాణానికి ఓకే అంది:
– ప్రభుత్వానికి ఎకరాకు రూ.2.5 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంది:
– ఎకరాకు అదనంగా రూ.2.5 లక్షలు ఈ ప్రభుత్వం తీసుకురాగలిగింది:
– దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది:
– అలాగే సోలార్‌/విండ్‌ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష

చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది:
– దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల కాలంలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి:
– అంతే కాక రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంటుకు గాను, మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.1 లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున

ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది:
దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్లు ఆదాయం వస్తుంది:
– ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపులు కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి అదయంగా ఆదాయం వస్తోంది.
– ఇదే గత ప్రభుత్వంలో కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఆదాయాన్ని చూపించారు:
– ప్రభుత్వానికి

ఈ రకమైన మేలు చేయడానికి ప్రయత్నించిన అధికారులను అభినందిస్తున్నా:

భోగాపురం ప్రాజెక్టు:
– భోగాపురం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటో చాలా స్పష్టంగా కనిపించింది: సీఎం
– గత ప్రభుత్వం 2703 ఎకరాలను విమానాశ్రయానికి కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు

జరిపింది:
– అదే కంపెనీ 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వచ్చింది:
– గత ప్రభుత్వంతో ఒప్పందం సమయంలో కడతానన్న ప్రతి సదుపాయం కూడా 2203 ఎకరాల్లో ఆ కంపెనీ కట్టేందుకు ముందుకు వచ్చింది:
– కంపెనీ మారలేదు, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవు, భూమీ మారలేదు. వచ్చిందల్లా ప్రభుత్వంలో మార్పే:


పునర్‌ సంప్రదింపులు కారణంగా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ. 3 కోట్లు వేసుకున్నా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఆదాయం మిగిలినట్టే:

రివర్స్‌ టెండరింగ్‌:
– సుపరిపాలనలో భాగంగా, విప్లవాత్మక మార్పుగా చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ పైనా సీఎంకు వివరాలు అందించిన అధికారులు.
–  మొత్తంగా 788

టెండర్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించామన్న అధికారులు
– సాధారణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 15.01 శాతం మిగులు ఉంటుందని వెల్లడించిన అధికారులు

– ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సీఎం ఆదేశం
– కోటి రూపాయల వ్యయం దాటిన ఏ

పనికి అయినా రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాల్సిందే: సీఎం
– ప్రభుత్వానికి చెందిన ఏ విభాగమైనా రివర్స్‌ టెండరింగ్‌ వెళ్లాల్సిందే..:
– టీటీడీ లాంటి సంస్థలు కూడా కోటి రూపాయలు దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందే:
– తప్పనిసరిగా రివర్స్‌ టెండరింగ్‌ పాటించేలా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని

అధికారులకు సీఎం ఆదేశం:

జ్యుడిషియల్‌ప్రివ్యూ:
– రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషయల్‌ ప్రివ్యూకు వెళ్తున్నాం: అధికారులు
– 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకూ 45 ప్రాజెక్టులు ఆ ప్రివ్యూకు వెళ్లాయి
– రూ.14,285 కోట్లు విలువైన పనులు జ్యుడిషయల్‌ ప్రివ్యూకు వెళ్లాయని సీఎంకు వివరించిన

అధికారులు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam