DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలంలో అయ్యవారు. . .ఒలకపోసి ఎత్తుకుంటున్నారు..

*సింహగిరిలో ముగిసే కాంట్రాక్టులు ముందుగా తెలియాదా?*  

*మీడియా ద్వారా అందరికి తెలిశాకే. కాంట్రాక్టు బయటకు వస్తుందా?*

*పదేళ్ల నుంచి పారాయణదారుల కాంట్రాక్టర్ ఒక్కరేనా?* 

*ఆర్ధిక భారం అవుట్ సోర్సింగ్ కేనా. బదిలీ పై వచ్చిన వాళ్ళకి లేదా?*

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్

కెవివివి సత్యనారాయణ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 25, 2020 (డిఎన్ఎస్):* అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే   ఒలకపోసి ఎత్తుకుంటున్నారు అనే సామెత శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం నిర్వాహకుల విషయం లో సరిపోలే విధంగా ఉందని, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు

డాక్టర్ కెవివివి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. దేవస్థానం లో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల కాంట్రాక్టు ముగిసే గడువు సమయం ముందుగానే తెలుస్తుందని, అయినప్పటికీ దానికి తగిన ఏర్పాట్లు చెయ్యకుండా, ఈఓ వీళ్ళని గడువు పేరుతొ తొలగించడాన్ని తప్పుపట్టారు. ఈ విషయం మీడియా ద్వారా భక్తులందరికీ తెలిసిన తర్వాత

తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం సింహాచలం ఈఓ భ్రమరాంబ చేస్తున్నారన్నారు. 

ఇదే ఘటన గత నెల గోశాల విషయం లో జరిగిందని, రెండు రోజుల క్రితం నిత్యా పారాయణదారులను తొలగించారన్నారు. మీడియా ఏజెన్సీ ద్వారా ఈ విషయం బట్టబయలు కావడంతో సత్వరం దిద్దుడు కార్యక్రమం చేపట్టారన్నారు. 

పారాయణ దారుల విషయంలో ఏమి

జరిగింది?

ఆదివారం తొలగించబడిన నిత్యపారాయణ దారులు గత పది ఏళ్లుగా ఈ విధుల్లో ఉన్నారని, వీరికి ఈ విధులు అప్పగించినప్పుడు వీళ్ళకి ఎన్ని సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారో చెప్పాలన్నారు.?

కాల పరిమితి ముగియడానికి కనీసం రెండు నెలల ముందుగా వీళ్ళకి నోటీసు ఇవ్వాల్సి ఉండగా, అది లేదన్నారు. 

వీరిని

తొలగిస్తే తదుపరి ఆ విధులు ఎవరు నిర్వహిస్తారో చెప్పకపోవడం గమనార్హం అన్నారు. పైగా శాశ్వత వైదిక ఉద్యోగుల్లో ఎంతమందికి ఈ పారాయణ అలవాటు ఉందొ తెలియదన్నారు. దానికి అదనంగా వాళ్ళ విధులు కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. 

ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగించడం పైగా, కాంట్రాక్టు ముగిసింది అని చెప్పడం తమ తప్పిదాన్ని

కప్పిపుచ్చుకోడానికేగాని, పైగా ఈ విషయాన్నీస్థానిక మీడియా కు కూడా ఇదే పత్రికా ప్రకటన విడుదల చెయ్యడం కూడా గమనార్హం అన్నారు. 

అయితే వీళ్ళ కాంట్రాక్టు ఎప్పుడు ముగిసింది, వీళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎప్పుడు ఇచ్చారో కూడా వివరాలు లేకపోవడం కడు శోచనీయం అన్నారు. 

పైగా ఆర్ధిక భారం అనే

విషయాన్నీ కూడా తెలియచేయడం ఒక అంశం గా చూడాలన్నారు. దశాబ్దాల కాలం నుంచి స్వామి సేవ చేస్తున్న అతి తక్కువ గౌరవ వేతనం ( రూ. 300 రోజుకు) వైదిక స్వాములకు మాత్రమే వర్తిస్తుందా ?, ఇతర ఆలయాల నుంచి బదిలీ పై సింహాచలం కు వచ్చిన అధికారులకు వర్తించదా అని ప్రశ్నించారు. 

ఇతర దేవస్థానం లో గుమస్తాగా ( నెలకు రూ. వేలల్లో జీతం) ఉన్న

వ్యక్తి సింహాచలం బదిలీపై రాగానే ఉన్నతాధికారిగా (నెలకు రూ.  లక్ష కు పైగా జీతం) నియమించడం ఆర్ధిక భారం కాలేదా అని ప్రశ్నించారు.

చేతులు కాలాక ఆకులూ పట్టుకోవడం కంటే. . సమస్య ముదిరి పాకాన పడక ముందే తగిన చర్యలు తీసుకుంటే దేవాలయ నిర్వహణ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam