DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొరహిత్యం కులవృతిగా గుర్తించి, బ్రాహ్మణులను ఆదుకోవాలి

*రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మయజ్ఞం తో ఆవేదన వెల్లడి*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 25, 2020 (డిఎన్ఎస్):* పొరహిత్యం బ్రాహ్మణ కులవృతిగా ప్రభుత్వం గుర్తించి రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన అన్ని కులవృతిల వారికి అందచేస్తున్న సంక్షేమ పథకాలు బ్రహ్మణులలో పొరహిత్యం

చేసుకుంటున్నా వారికి కూడా వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మయజ్ఞం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహా మూర్తి తెలిపారు. 

సెప్టెంబర్ 1 వ తేదీన అనంతపురం లో పురోహిత సమాఖ్య బ్రహ్మయజ్ఞం కల్లూరు మురళీధర్

శాస్త్రి, మైదోలం శ్రీనివాస్ శాస్త్రి గారి నిర్వాహణ లో జరగనుందన్నారు. అగ్రవర్ణం ముసుగు వేసి, పేద బ్రాహ్మణులను సజీవంగా కాటికి పంపేస్తున్నారన్నారని మండిపడ్డారు.  ఆర్ధిక బాధలు తట్టుకోలేక ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. 

ఈ బ్రహ్మయజ్ఞం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత

బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర గౌరవ సలహాదారులు ఈమని రామచంద్ర సోమయాజ ఘనపాటీ, రాష్ట్ర అధ్యక్షులు పొదిలి నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి నాగాభొట్ల సుబ్రహ్మణ్యం, అధికార ప్రతినిధి నాగాభొట్ల రవి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బంకుపల్లి అంజనీకుమార్ శర్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెన్నేటి సునీల్ శర్మ,

బ్రహ్మయజ్ఞం ఛానల్ చైర్మన్ అంపోలు ఉమామహేశ్వర శర్మ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గుండాపంతుల రామసుబ్రహ్మణ్య శర్మ మరియు 13 జిల్లాల నుండి పురోహిత సమాఖ్య అధ్యక్ష కార్యదర్సులు, కార్యవర్గ సభ్యులు పాల్గొనుచున్నారు.

అనంతపురం లో ఉదయాన్నే యజ్ఞ యాగాదులు, జప, తపాదులు పూర్తి అయిన తరువాత వేద స్వస్తి పఠనం, పండిత గోష్ఠి, పండిత

సత్కారం, అనంతపురం జిల్లా శాఖ పురోహిత సమాఖ్య కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమములు జరుగును.

ప్రధాన ఆకాంక్షలు  ఇవే: 

పొరహిత్యం చేయిస్తున్న బ్రాహ్మణులను ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తూ ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేయాలని, 
50 సంవత్సరాలు నిండిన పురోహిత బ్రాహ్మణులకు వృద్దాప్యం పింఛను

కల్పించాలని, 
ప్రతీ జిల్లాలో వైదిక భవనాలు నిర్మించి వాటిలో హాస్టల్ తో కూడిన వేద పాఠశాలలు నిర్మించాలని, 
ప్రతీ ప్రముఖ పుణ్యక్షేత్రం లో వైదిక అనుష్ఠానం కొరకు వైదిక భవనాలకు స్థలాలు కేటాయించాలని, 
ప్రతీ శైవ వైష్ణవ దేవాలయాల్లో స్థానాచార్యులుగా పురోహితులని నియమించాలని, ప్రయివేటు దేవాలయాలలో పనిచేస్తున్న

పురోహితులకు కనీస వేతనం ఇప్పించాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖా, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఖాళీగా ఉన్న వేద పండితులు పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని, 
రాష్ట్రంలో మూతపడిన సంస్కృత పాఠశాల లు కళాశాల లు వెంటనే పునఃప్రారంభం చెయ్యాలని 
ముఖ్యంగా ప్రమాదంలో గానీ ఆకస్మికంగా గానీ పురోహితుడు మరణిస్తే ఆ కుటుంబాలకు

ప్రభుత్వం ఆర్ధికంగా సహాయం చెయ్యాలని అదేవిధంగా ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రాష్ట్రంలో అగ్రవర్ణంగా ముద్రపడి ఆర్థికంగా బలహీనపడిన రాష్ట్రంలో లక్ష ఇరవైవేలమంది పురోహితులను ప్రభుత్వం ఆదుకోవాలని, వైదిక ధర్మానుష్టం గా లోకా సమస్తా  సుఖినోభావంతు అని అనునిత్యం నిస్థాగరిస్టులు అయిన

పురోహితులు ధర్నాలు బంద్ లు చేయలేమని, ప్రభుత్వమే పురోహితులని ఆదుకోవాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురోహిత నాయకులు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam