DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా లో అభివృద్ధి పనుల తీరు పై ఎమ్మెల్యే లతో  సమీక్ష

*ఎమ్మెల్యే లకు పర్యాటక మంత్రి ముత్తంశెట్టి పలు సూచనలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 25, 2020 (డిఎన్ఎస్):* విశాఖ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరుపై ఎమ్మెల్యేలతో రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిధి గృహం లో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, అదీప్ రాజ్, పొల్గొన, ఉమ శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, కన్నబాబు, ముత్యాల నాయుడు అరకు ఎంపీ మాధవి పలువురు

పాల్గొన్నారు. 

నియోజకవర్గాల వారిగా మంత్రి వర్యులు కోవిడ్-19 నివారణ, చికిత్స , ఆరోగ్య శ్రీ,  ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలు, నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో మహిళలకు శిక్షణ, జీవనోపాధి, వ్యవసాయ శాఖ లో ఈ-క్రాప్ డేటా ఎంట్రీ, రైతు

భరోసా కేంద్రాల నిర్వహణ, పలు అంశాలపై  పై సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింతగా ప్రజల్లో అవగాహన కల్పించి అర్హత ఉన్న  ప్రతి ఒక్కరికి అందేలా  చూడాలన్నారు. నియోజకవర్గ లోని కరోన  నివారణలకై .. తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
 సీజనల్ వ్యాధులు బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని

పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామా స్థాయి నుంచి మౌళిక వసతులు , రోడ్లు, పారిశుధ్యం
అన్ని అభివృద్ధి పనులపై చర్చించారు.
 నియోజకవర్గాల్లో  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కోవిడ్ నిబంధనలు మేరకు చేపట్టాలని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ..దేశం లోని ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేసిన వాలింటర్స్

వ్యవస్థని నెలకొల్పటంతో ..ప్రజలకు  ప్రభుత్వ అందిస్తున్న పథకాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా వాలింటర్స్ లబ్ధిదారులకు అందిస్తున్నారాని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురించేశాయని..అనేక సార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రయోజన లేదన్నారు. అందుకనే ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి

చెప్పారన్నారు. వైఎస్సార్ చేయూత  పథకం పలు పథకాల ద్వారా లక్షలాది మంది మహిళలను  ఔత్సాహిక వ్యాపార వేత్తలుగా మార్చటమే కాకా ఇది వరకే ఆయా రంగాల్లో ఉన్న వారికి బలమైన తోడ్పాటు అందించి వారి సుస్థిర జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగు పడేందుకు దోహద పడతాయన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం , చేయూత ఈ రెండు పథకాలు తో గ్రామీణ ఆర్థిక

వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పాఠశాలలు ప్రారంబైయే నాటికి నాడు నేడు కు సంబందించిన పనులను వేగవంత చేసేలా చూడాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ద్యేయమని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam