DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వైరస్ కట్టడికి అందుబాటు లోకి రూమ్ శానిటైజర్ ఆవిష్కరణ

*విశాఖ డీజిల్ లోకో షెడ్ సిబ్బంది కి రైల్వే అధికారుల అభినందనలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* వివిధ వినూత్న ప్రయోగాలు చేస్తున్న విశాఖ పట్నం రైల్వే డీజిల్ లోకో షెడ్ సిబ్బంది మరో అద్భుతమైన ఆవిష్కరణ కు రూపకల్పన చేసారు. ఒక చిన్న ట్యూబ్ లైట్ లా

ఉండే ఎలక్ట్రికల్ రూమ్ శానిటైజర్ ను  ఆవిష్కరించారు. కరోనా కట్టడికి వివిధ రూపాల్లో వైరస్ ను అరికట్టే విధంగా దీన్ని తయారు చేసారు.  ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అద్భుతమైన ఆవిష్కరణలను చేపట్టిన రైల్వే డీజిల్ లోకో షెడ్ సిబ్బందిని సీనియర్ డివిషనల్ కమర్షియల్ మేనేజర్ ఏ. కె త్రిపాఠి అభినందించారు. 

గతం లో

కాలితో బట్టన్ నొక్కితే నీరు వచ్చే వాష్ బేసిన్, హ్యాండ్ శానిటైజర్ పరికరాలు, కాగిత శానిటైజర్లు, నగదు శానిటైజర్లు తదితర పరికరాలను తయారు చేసింది ఈ విభాగం సిబ్బందే. వీరి ఆవిష్కరణలనే నేడు విశాఖ రైల్వే సిబ్బంది విజయవంతంగా వినియోగించుకుంటున్నారు. 

కరోనా రాక్షసునితో పోరాటం చేసేందుకు ప్రస్తుతం రిమోట్ తో

కంట్రోల్ చేసే రూమ్ శానిటైజర్ ను తయారు చేసారు. దీన్ని పనికిరాని పెడస్టల్ ఫ్యాన్ స్టాండ్ కు యు వి సి బల్బులను అమర్చి, దానికి రిమోట్ కంట్రోల్ యూనిట్ ను బిగించారు. స్టాండ్ కు చక్రాలను అమర్చడం ద్వారా ఒక గది నుంచి మరోగది లోకి సులభంగా తిరుగుతుంది. 30 నిమిషాల 
కంటే తక్కువ సమయంలో 400 అడుగులు విస్తీర్ణం ఉన్న గదిని

శుభ్రపరుస్తుంది. చిన్న  గదులను కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఫ్రీ చేస్తుందని తెలియచేస్తున్నారు. ఈ పరికరంలో  అల్ట్రా వైలెట్ క్రిమిసంహారక పరిజ్ఞాన సాధనాన్ని వినియోగించారు. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ   రేడియేషన్ ద్వారా గ్రహించబడిన వైరస్ క్రిములను ఫొటోడిమెరిజెషన్ విధానం ద్వారా నశింపచేస్తుంది. 
ప్రస్తుతం ఈ విధమైన

పరికరాలను విశాఖపట్నం రైల్వే డి ఆర్ ఎం కార్యాలయం లోను, రైల్వే ఆసుపత్రిలోనూ వినియోగిస్తున్నట్టు సీనియర్ డివిషనల్ కమర్షియల్ మేనేజర్ ఏ. కె త్రిపాఠి తెలిపారు.     

నూతన ఆవిష్కరణలు విశాఖపట్నం రైల్వే డి ఆర్ ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ (డీజిల్) పర్యవేక్షణలో

జరిగింది.  ఈ పరికరం 30 మీటర్ల దూరం నుంచి కూడా ఆపరేట్ చెయ్యవచ్చు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam