DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంపు ఎకరాల పంట రైతులకు నష్ట పరిహారం ఇవ్వండి

*పగో జిల్లా కలెక్టర్ కు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి లేఖ*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 28, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమగోదావరి జిల్లాలో ముంపునకు గురైన  12,115ఎకరాల్లో పంట రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి, రైతు కుటుంబాలను ఆదుకోవాలని,  జిల్లా తెలుగుదేశం పార్టీ

అధ్యక్షరాలు, మాజీ ఎంపీ తోట సీతారామల క్ష్మి జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు మండలాల వారీగా ముంపుకు గురైన వివరాలకు తెలియచేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. 

పోలవరం నియోజకవర్గంలోని మండలాల్లో కుక్కునూరు మండలంలో 605 ఎకరాల్లో వరి 462 ఎకరాల్లో ప్రత్తి, పోలవరం మండలంలో 1042 ఎకరాల్లో వరి, టి. నరసాపురం

మండలంలో 45 ఎకరాల్లో వరి, వేలేరుపాడు మండలంలో 150 ఎకరాల్లో వరి, కొయ్యలగూడెం మండలంలో 10 ఎకరాల్లో మొక్కజొన్న. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం మండలంలో 55 ఎకరాల్లో వరి. ఆచంట నియోజకవర్గం ఆచంట మండలంలో 875 ఎకరాల్లో వరి. కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలంలో 250 ఎకరాల్లో వరి, తాళ్లపూడి మండలంలో 240 ఎకరాల్లో వరి. పాలకొల్లు

నియోజకవర్గం పోడూరు మండలంలో 1325 ఎకరాల్లో వరి, పాలకొల్లు మండలంలో 362 ఎకరాల్లో వరి,చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో 32 ఎకరాల్లో వేరుశెనగ, ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో 152 ఎకరాల్లో వరి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం మండలంలో 10 ఎకరాల్లో వరి,నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలో 50 ఎకరాల్లో వరి,

యలమంచిలి మండలంలో 1275ఎకరాల్లో వరి. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో 3 ఎకరాల్లో వేరుశెనగ ముంపునకు గురైందని. జిల్లాలోని 3182 ఉద్యాన పంటలు ముంపునకు గురైందని అందులో 760ఎకరాల్లో కూరగాయలు, 1957 ఎకరాల్లో అరటి, 185 ఎకరాల్లో కంద, 28 ఎకరాల్లో పూలతోటలు, 53 ఎకరాల్లో బొప్పాయి, 200 ఎకరాల్లో తమలపాకులు తోటలు ముంపునకు గురైందని అన్నారు.  ఇటీవల

కురిసిన వర్షాలకు  ఈ క్రింది తెలుపబడిన  ప్రాంతాలలో ముంపు నష్టం జరిగిందని పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో, ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలం, పెనుగొండ మండలం, పెరవలి మండలం, నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం,  కొవ్వూరు నియోజకవర్గం లోని కొవ్వూరు మండలాల్లో 70 కోట్ల విద్యుత్ నష్టం

జరిగిందని, ప్రబుత్వం 140 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు అంటున్నారు అందులో మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యాలి సుమారు 40వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం ముంపు ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని వారికీ 2000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారని ప్రకటించారు కానీ ఇంతవరకు ఎటువంటి సహాయం చేయలేదని అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam