DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ఎస్ఎస్ సంఘ్ శిబిరం లో ప్రసంగమే దేశంలో సంచలనం  

*భిన్న సిద్ధాంతాల సంస్థలనూ ఆకట్టుకున్న ఏకైక వ్యక్తి దాదా*  

*ట్రబుల్ షూటర్ బెంగాలీ బ్రాహ్మడి పై DNS ప్రత్యేక కధనం. . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 31, 2020 (డిఎన్ఎస్):* కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా పేరుపొందిన ప్రణబ్ ముఖర్జీ చేసిన ఒక ప్రసంగం దేశ

వ్యాప్తంగా సంచలనంగా మారింది. జూన్ 7,2018 రోజున నాగపూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్ ) శిక్ష వర్గ్ మూడవ సంవత్సర ముగింపు వేడుకల్లో ప్రధాన వక్తగా దాదా పేరు ప్రకటించడమే ఒక సంచలనం కాగా, అయన చేసిన ప్రసంగంతో రాజాకీయ పార్టీలు, ప్రార్ధనా సంస్థలు, విద్యార్థులు, యువత, సామాన్యులు, అసామాన్యులు ఇలా యావత్ భారత్ దేశం ఎంతో

ఉత్కంఠగా ఎదురు చూసిన ఘడియలు అవి.  ఎక్కడా తన ఉనికిని కోల్పోకుండా, సంఘ్ పరివార్ చేస్తున్న సేవలను కొనియాడుతూ, అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఒక్క ప్రసంగం చాలు  ఆయన మేధస్సును తెలుసుకోడానికి అని అందరిచేత కొనియాడబడింది. 
ఇదే సభలో ముందుగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్, గురూజీ గోల్వార్కర్ కు

నివాళి అర్పించడమే ఆయన ఎంత గొప్ప మేధావో బహిర్గతమైంది.  

రాజకీయ పరంగా ఎన్ని హోదాల్లో ఉన్నప్పటికీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంతో అన్ని సంప్రదాయ పద్ధతులనూ పాటించడం ఆయన గొప్పతనం. భావితరాలకు మార్గదర్శకం చేసిన ఘనులు.

ఆంధ్ర విభజనలో అత్యంత కీలకం ఈయనే. . .

ఆంధ్ర ప్రదేశ్ ముచ్చటగా

మూడవ సారి అధికారికంగా విభజించబడింది ఈయన రాష్ట్రపతిగా ఉండగానే. 2014 ఫిబ్రవరి 20 న ఉభయ పార్లమెంట్ సభల్లో ఆమోదం పొందిన విభజన బిల్లు చేరింది రాష్ట్రపతిగా ఉన్న ఈయన వద్దకే.
అయితే ఈ విభజన బిల్లు తయారీకి శ్రీకారం చుట్టింది కూడా ఈయనే కావడం గమనార్హం. రాష్ట్రపతి కాక ముందు భారత ఆర్థిక మంత్రిగానూ, కాంగ్రెస్ పార్టీ లో అత్యంత కీలక

హోదాలో ఉన్న ఈయన వార్ రూమ్ లో వివిధ పార్టీలు, తమ సభ్యులతో చేసిన మంతనాలు బిల్లు రూపంలో వచ్చినట్టు సమాచారం. అయితే తదుపరి బీజేపీ సైతం తన అంగీకారం తెలపడంతో బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.
కాంగ్రెస్ వార్ రూమ్ లో తానే తయారు చేసిన విభజన బిల్లుకు, రాష్ట్రపతిగా ఈయనే ఆమోద ముద్రవేయడం

గమనార్హం. 

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ . . .  

ఇందిరా సమయం నుంచి నేటి రాహుల్ వరకూ, కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాల్లో పడిన ప్రతీ సారీ అందరికీ వినిపించే పేరు ప్రణబ్ ముఖర్జీ యే. తన అపార మేధావితనంతో అన్ని సార్లూ సానుకూల పరిష్కారమే చూపించారు. ఈయన విఫలం అయ్యిన దాఖలాలు అతి తక్కువే అని చెప్పవచ్చు. ప్రత్యర్థి

పార్టీల నేతలను సైతం తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే వారు. 

ఆర్బీఐ గవర్నర్ గా మన్మోహన్ ఎంపిక లో. . .

భారత్ దేశం అందించిన విజయవంతమైన రిజర్వు బ్యాంకు గవర్నర్లలో ఒకరు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన ఆ పదవికి ఎంపిక కావడంతో కీలక పాత్ర పోషించింది ప్రణబ్ ముఖర్జీయే. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam