DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంట్రాక్టు న‌ర్సుల నెలసరి జీతాల్లో అస‌మాన‌తలొద్దు..!

*కేజీహెచ్ లో కాంట్రాక్టు న‌ర్సుల శాంతియుత నిర‌స‌న‌*

*స్టాఫ్ న‌ర్సుల‌ను ప‌ర్మినెంట్ చేయాలంటూ డిమాండ్‌*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2020 (డిఎన్ఎస్):* కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో సేవ‌లందించే న‌ర్సింగ్ సిబ్బంది వేత‌నాల‌లో హెచ్చు

త‌గ్గుల‌ను స‌రిచేయాల‌ని న‌ర్సింగ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కోరింది. గ‌త ఆర్నెల్లుగా ప‌ర్మినెంటు ఉద్యోగుల‌తో స‌మానంగా ప్రాణాల‌కు తెగించి కోవిడ్‌-19 విధులు నిర్వ‌హిస్తున్న త‌మ‌కంటే ఇటీవ‌ల కోవిడ్‌-19 విధుల కోసం రిక్రూట్ చేసిన స్టాఫ్ న‌ర్సుల‌కు అధిక‌

వేత‌నం నిర్ణ‌యించ‌డం స‌బ‌బుగా లేద‌ని అసోసియేష‌న్ ఉటంకించింది. ఈమేర‌కు న‌గ‌రంలోని కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కార్యాల‌యం ఎదుట బుధ‌వారం ఉద‌యం ఒప్పంద వేత‌నంపై ప‌నిచేసే న‌ర్సులు శాంతియుత నిర‌సన చేప‌ట్టారు. న‌గ‌రంలోని కింగ్ జార్జి ఆస్ప‌త్రి(కేజీహెచ్‌), విక్టోరియా జ‌న‌ర‌ల్

హాస్పిట‌ల్‌(వీజీహెచ్‌) విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌) ఆస్ప‌త్రుల‌లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో విధులు నిర్వ‌హిస్తున్న న‌ర్సింగ్ ఉద్యోగులు ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం అనే సూత్రాన్ని రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో ప‌నిచేసే స్టాఫ్

న‌ర్సుల‌కు వ‌ర్తింప‌జేయాల‌ని వారు డిమాండ్ చేశారు. డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రిధిలో నియామ‌కం చేప‌ట్టి రాష్ట్రంలోని వివిధ‌ బోధ‌నాస్ప‌త్రులు (టీచింగ్ హాస్పిట‌ల్స్‌)లో గ‌త ఐదేళ్లుగా ప‌నిచేస్తున్న త‌మ‌కు నెల‌కు రూ. 22,500  ఒప్పంద వేత‌నం చెల్లిస్తూ, అదే ప‌ని కోసం డైరెక్ట‌రేట్

ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్తుల‌ ద్వారా తాజాగా చేప‌ట్టిన నియామ‌కంలో స్టాఫ్ న‌ర్సులుగా విధుల్లో చేరిన ఒప్పంద ఉద్యోగుల‌కు 34,000 వేత‌నం నిర్ణ‌యించ‌డం త‌మ‌లో త‌మ‌కు త‌గ‌వులు పెట్టే విధంగా ఉంద‌ని జ‌య‌ల‌క్ష్మి త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. రోజుకు ఎనిమిది నుంచి 12

గంట‌ల‌పాటు నిరంత‌రాయంగా పి.పి.ఇ. కిట్ ధ‌రించి విధులు నిర్వ‌ర్తిస్తున్న త‌మ ప‌ట్ల ముఖ్య‌మంతి వై.ఎస్‌. జ‌గ‌న్ మోహ‌న రెడ్డి క‌రుణ చూపి స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం సూత్రాన్ని అమ‌లు చేయాల‌ని ఆయ‌న కోరారు. జి.ఒ. నెంబ‌రు 44 ప్ర‌కారం డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎద్యుకేష‌న్ ప‌రిదిలో ప‌నిచేస్తున్న

స్టాఫ్ న‌ర్సులంద‌రినీ ప‌ర్మినెంటు చేయాలి, న‌ర్సింగ్ పోస్టుల భ‌ర్తీలో కాంట్రాక్టు విధానానికి స్వ‌స్తి ప‌ల‌కాలి, జ‌గ‌న్ అన్న మా కుటుంబాల‌కు భ‌రోసా క‌ల్పించాలి, పేషెంట్ల ముఖాల్లో సంతోషం నింపే త‌మ ముఖాల్లో సంతోషం నింపే బాధ్య‌త జ‌గ‌న‌న్న‌దే.. వంటి ప్ల‌కార్డుల‌తో విధుల‌కు ఎటువంటి అంత‌రాయం

క‌లిగించ‌కుండా ఈ నిర‌స‌న చేప‌ట్ట‌డం గ‌మ‌నార్శం. నిర‌స‌న అనంత‌రం .. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్‌ వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి వ‌ర్థంతి సంద‌ర్భంగా పుష్ప‌నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌసియా, గ్రేస్‌, సౌమ్య‌, హైమ‌, శిరీష త‌దిత‌రులుమాట్లాడారు. విశేష సంఖ్య‌లో పాల్గొన్న ఒప్పంద

స్టాఫ్ న‌ర్సులు, మ‌ద్ద‌తుదార్ల‌తో ఆ ప్రాంగ‌ణ‌మంతా ఉద్య‌మ వాతావ‌ర‌ణం క‌నిపించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam