DNS Media | Latest News, Breaking News And Update In Telugu

35 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ కి ఢోకా ఉండదు.

కీలక అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 03, 2020 (డిఎన్ఎస్):* రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా

భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. కేబినేట్‌ ఈరోజు సమావేశమైంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.



సందర్భంగా సీఎం జగనన్న మాట్లాడుతూ.. అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం

చేశారు.

‘చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది. సుమారు 8వేల కోట్ల మేర ఉచిత విద్యుత్తు బకాయిలు పెట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చాం.

రూ. 1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేశాం. నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం.

ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు’’ అని సీఎం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక కేంద్ర

ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం గారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు: . .

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై

నిషేధం

నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా.

ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం.

డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా

ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు

రాష్ట్రంలో ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం

పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం

రాష్ట్రంలో ఉన్న

లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం

భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయం

విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం

రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
/> రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం

రూ. 1280 కోట్లతో మోపిదేవి

వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం

రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం

బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది
రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని

నిర్ణయం

బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam