DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యశ్రీ ని నీరుగార్చేలా ఆస్పత్రులపై కఠిన చర్యలు : సీఎం 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 04, 2020 (డిఎన్ఎస్):* ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. కోవిడ్‌ –19 పరిస్థితులపై శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు.  కోవిడ్ ‌ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయని, ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయన్న అధికారులు
కావాలనే కొన్ని పత్రికలు విషపూరిత రాతలు రాస్తున్నాయని సమావేశంలో చర్చలో తెలిపారు. 

కోవిడ్‌

ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై  అధికారులు వివరాలు అందించారు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేశామన్నారు. రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు ఉన్నాయని, అందులో 4,676 పోస్టులు నియామకం, 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతున్నట్టు, మరో 10 రోజుల్లో ఈ పోస్టుల భర్తీ పూర్తవుతుందన్న

అధికారులు తెలిపారు. 

కోవిడ్‌కోసం ప్రస్తుతం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు చేశామని, కోవిడ్‌ టెస్టులకోసం రూ. 4.3 కోట్లు ,ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందులు కోసం రూ. 4.57 కోట్లు అయ్యిందన్నారు. 

హెల్ప్‌ డెస్క్‌లను ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పెట్టాలని, ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని

నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేయాలని, ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపానల్‌ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాలన్నారు. రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని

తెలిపారు. 

కోవిడ్‌ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని వైఎస్ జగన్ తెలిపారు. రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేన్నారు. 

పతిరోజూ అధికారులు కాల్‌ సెంటర్లకు మాక్‌

కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలని, ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలని ఆదేశించారు.

ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలికసదుపాయాలు.. ఈనాలుగు పారామీటర్స్‌ మీద ప్రశ్నలు వేసి.. రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. వీటిద్వారా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వండని అధికారులను

ఆదేశించారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణంకోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam