DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వచ్చే 45రోజులు అత్యంత కీలకం: కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  సెప్టెంబర్ 04, 2020 (డిఎన్ఎస్):* కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా నివారణకు వచ్చే 45రోజులు అత్యంత కీలకంగా విధులు నిర్వర్తించాలని శ్రీకాకుళం  జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్య సిబ్బందికి సూచించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి

తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.  కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న కంటోన్మెంట్ జోన్లు , హోమ్ ఐసోలేషన్,
హోమ్

కోరంటైన్ లో ఉన్నవారిపై  ప్రజలకు అవగాహన కల్పించి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో చాకిపల్లి గ్రామంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రజానీకానికి హోమ్ఐసోలేషన్ , కంటోన్మెంట్ జోన్లపై అవగాహన లేకపోవడం వలన కేసులు
పెరుగుతున్నాయని వైధ్యాదికారులు

చెప్పిన సమాధానంపై ఆయన స్పందిస్తూ అవసరమైతే ఆయా ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు కఠినతరం చేసేందుకు144 సెక్షన్ అమలుచేసే విధంగా చూడాలని అధికారులను సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. వలంటీర్లు, సర్వేలైయస్ సిబ్బంది బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని ఎప్పటికప్పుడు

జాగరూకతో వ్యవహరించి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. హోంఐసోలేషన్ లో ఉన్న వారికి అవసరమైన మందుల కిట్లు అందివ్వాలని అవసరం మేరకు జిల్లా నుంచి
సరఫరా చేస్తామని తెలిపారు. ఆరు మాసాలుగా ఎ.ఎస్.ఏంలు చేపడుతున్న సేవలు అభినందనీయమని మరో 45 రోజులు శ్రమిస్తే కరోనా వైరస్ పూర్తిగా కట్టడిచేసిన వారమవుతామని కావున

నియంత్రణలో ఎటువంటి అలసత్వం వహించవద్దని కోరారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ర్యాపిడ్ పరీక్షలు సంఖ్య పెంచడం వలన కేసులను గుర్తించడం వేగవంతం అవుతుందని కావున పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. ఎక్కడైనా 50 కేసులకన్నా అదనంగా నమోదైతే ఆయా ప్రదేశానికి కోవిడ్ పరీక్షలు చేపట్టే బస్సును పంపించేందుకు

సిద్ధంగాయున్నామని కలక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహణకు ప్రజలు ముందుకు వస్తున్నారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తొందరగా కోవిడ్ పరీక్షలకు ముందుకువస్తే తొందరగా కరోనా వైరస్ ను నయం చేసుకోవచ్చని అన్నారు. వైద్య సిబ్బందికి పంపిణీ చేసిన మాస్కులు, ఫేస్ షీల్డ్ లను తప్పకుండా వినియోగి వైరస్ బారిన

పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గనూర్ సూరజ్ ధనుంజయ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డా, లీలా, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా, కణితి కేశవరావు, మండల ప్రత్యేక అధికారి డా,మంచుకరుణాకర్ రావు, తహసీల్దార్ కె.శ్రీరాములు, ఎంపిడిఓ పి.నారాయణ మూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ బి.గణేష్, వైద్యులు,

సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam