DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలి : సబ్‌ కలెక్టర్*

*ప్రైవేట్‌ కోవిడ్‌ 19 ఆసుపత్రి తనిఖీలో అనుపమ అంజలి వెల్లడి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 05, 2020 (డిఎన్ఎస్):* ప్రైవేటు కోవిడ్‌ `19 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోన వైరస్‌ బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌

కలెక్టర్‌ అనుపమ అంజలి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి జిల్లాలోని పలు ప్రైవేటు కోవిడ్‌`19 ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న సేవాలు తదితర అంశాలపై తనిఖీలు చేసేందుకు నియమించిన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు శనివారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ఆసుపత్రులను

తనిఖీలు చేశారు. దీనిలోభాగంగా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలికి రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణ ఆసుపత్రి, యాస్కంట్‌ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, సన్‌స్టార్‌ ఆసుపత్రి, ఆర్‌ఎస్‌ న్యూరో ఆసుపత్రి, సిద్ధార్థ నర్సింగ్‌ హోమ్‌ అండ్‌ పోలీ క్లినిక్‌ ఆసుపత్రుల యొక్క బాధ్యతలను సబ్‌ కలెక్టర్‌ అనుపమ

అంజలికి జిల్లా  కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి అప్పగించారు. ఈ బాధ్యతల్లో భాగంగా శనివారం ఉదయం నగరంలోని దానవాయిపేటలోని ఆర్‌ఎస్‌ న్యూరో ఆసుపత్రిని సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కోవిడ్‌`19 ఆసుపత్రుల ఏర్పాటు సందర్భంగా నిర్ధేశించిన అంశాలకు అనుగుణంగా ఏర్పాట్లు

చేశారా? లేదా? అనే అంశాలపై ఆమె ఆరా తీశారు. ఆర్‌ఎస్‌ న్యూరో ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారి ఇచ్చిన రిజిష్ట్రేసన్‌ సర్టిఫికెట్‌ ఉందా? ఆసుపత్రి ఉన్న భవనానికి ప్లాన్‌ అప్రూవల్‌ ఉందా? లేదా? అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఒసి ఉందా? లేదా? ఆసుపత్రిలో ఉన్న వైద్యుల సంఖ్యతోపాటు, నర్సులకు సంబంధించిన వివరాలు తదితర అంశాలను ఆమె

అడిగి తెలుసుకున్నారు. రోగుల యొక్క క్షేమాలను ఎప్పటికప్పుడు వారి వారి బంధువులకు సమాచారాన్ని తెలియచేసేందుకు అవసరమైన హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారా? లేదా? అనే వివరాలను సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న పది పడకల్లో కరోన వైరస్‌తో ఉన్న రోగులకు అందిస్తున్న ఆహారం, మందులు,

వైద్యుల యొక్క సేవలు ఎలావున్నాయి? వంటి అంశాలపై ఆమె రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు, ప్రజలు మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రోజు రోజుకీ కరోన వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని

అన్నారు. కోవిడ్‌`19 వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతోపాటు, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోన నివారణకు ముందుకు రావాలని సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి సూచించారు. ప్రైవేటు కోవిడ్‌ `19 ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో అదనపు

డిఎం అండ్‌ హెచ్‌ఒ కోమల, ఆసుపత్రి వైద్యులు కె.రవీంద్ర, తహసీల్దార్‌ సుస్వాగతం, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam