DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది ఆలయంలో అగ్నిప్రమాదం, ఆలయ రధం దగ్ధం.

*అంతర్వేది ఘటనపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం* 

*ప్రమాదం కాదు. . ముష్కరుల దుశ్చర్యే: భక్తులు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శనివారం రాత్రి జరిగిన

ప్రమాదం లో వార్షిక రథం దగ్ధం అయినా ఘటనపై దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటన కు గల కారణాలపై విచారణకు అయన ఆదేశించారు. ఈ అంశంపై దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, తూర్పు గోదావరి జిల్లా ఎస్సితో ఫోన్ మాట్లాడారు. 
స‌హ‌య‌క చ‌ర్యలు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌,

పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మంత్రి ఫోన్‌ల్లో మాట్లాడారు. విచార‌ణ అధికారిగా దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను నియ‌మించారు. ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో పాటు పోలీసులు సంబంధిత అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను

అదేశించారు. అంతే కాకుండా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున నిర్మాణానికి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి సూచించారు.

ప్రమాదం కాదు. . ముష్కరుల దుశ్చర్యే: భక్తులు 

ఎంతో ప్రాధాన్యత కల్గిన తూర్పుగోదావరి జిల్లా లోని అంతర్వేది  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి

దేవాలయమ లో శనివారం రాత్రి జరిగింది ప్రమాదం కాదని, ముష్కరుల దుశ్చర్యేలేనని భక్తులు మండిపడుతున్నారు.  
ఎన్నో  ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికులక్షత్రియుడు అలయనిర్మాత శ్రీ కోపనాతి కృష్ణమ్మ సిద్ధం చేయించినట్టు ఆలయ చరిత్ర తెలియచేస్తోంది. ప్రతి ఉత్సవం లోనూ స్వామి వారి ఉత్సవర్లను తిరువీధి వేడుకల్లో వినియోగించే ఈ

రధం పూర్తిగా మేలిమి జాతికి చెందిన కలపతో అత్యంత సుందరంగా చేయించడం జరిగింది. శనివారం రాత్రి ఈ రధం అగ్నిప్రమాదం గురై భిన్నమై, ఛిద్రమవ్వడం వెనుక ప్రమాదం కాదని, ఎవరో దుండగులు చేసిన అకృతమేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రధ మండపం ( షెడ్) వద్ద ఎటువంటి విద్యుత్ తీగలు లేవని, అలాంటప్పుడు విద్యుదాఘాతం జరిగే అవకాశమే

లేదని స్థానికులు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam