DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుళ్లను కాపాడలేని దేవాదాయ శాఖాను రద్దు చేయాల్సిందే.

*రాబందుల హస్తాల నుంచి గుళ్ళను కాపాడుకుందాం.*

*ఒక రధాన్ని కాపాడ లేని వాళ్లకి లక్షల్లో జీతాలెందుకు?: బీజేపీ*

అప్పనంగా గుళ్ళలోని డబ్బులు దోచుకోడానికా?:AP BJP మీడియా DS వర్మ 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ రెడ్డి, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2020 (డిఎన్ఎస్):* ఒక

గుడిలోని రధాన్ని కూడా కాపాడలేని దేవాదాయ శాఖలో వేలాది మంది ఉద్యోగులు, ఒక్కొక్కరికీ వేలు, లక్షల రూపాయల నెలే నెలా జీతాలు ఇవ్వడం శుద్ధ దండగ అని బీజేపీ  రాష్ట్ర కమిటీ మీడియా కో కన్వీనర్ డి ఎస్ వర్మ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం లో శనివారం రాత్రి ఏడు దశాబ్దాల నాటి

రధాన్నిముష్కరులు తగలబెట్టడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. 
ఈ ఘటనపై ఆదివారం భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, హిందూ పరివార్ సభ్యులు ఆలయం వద్ద నిరనసలు తెలియచేసారు. ఈ క్రమంలో ఇంచార్జి ఈఓ ను ఈ ఘటనపై నిలదీశారు. ఈ సందర్బంగా వర్మ మాట్లాడుతూ  ఈ రాష్ట్రంలో కేవలం హిందూ గుళ్లను మాత్రమే ప్రభుత్వం అధీనం లో పెట్టుకుని

దేవాలయాలను పరిరక్షించడం, ఆస్తులకు కాపాడమే ధ్యేయంగా వేలాది మంది ఉద్యోగులను నియమించి, ఇదే హిందూ గుడిలో హుండీల్లో భక్తులు వేసే ముడుపులు లక్షలాది రూపాయలను జీతాలుగా ఇస్తూన్నారన్నారు. వీళ్లకు జీతాలు ఇచ్చేదే గుళ్లను కాపాడడానికి అని, అలాంటిది గుళ్లను, ఆస్తులను తగలబడుతుంటే కళ్ళు అప్పగించి చూసే వీళ్లకు ఉద్యోగులెందుకు

అని ప్రశ్నించారు.  
నిన్న అంతర్వేది ఆలయంలో రూ. 70 లక్షలు విలువల చేసే రధాన్ని తగులబెట్టారని, ఇంతకూ ముందు నెల్లూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ఇలా ప్రతీ ఆలయంలో నూ ఇలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా, దేవాదాయ శాఖా పూర్తిగా కళ్ళు మూసుకు పోయిం, హిందువులకు పూర్తి ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇలా హిందువులకు

ఉపయోగం లేకుండా కేవలం అప్పనంగా గుళ్లను దోచుకోవడం మాత్రమే పనిగా ఉన్న రాబందుల్లాంటి దేవాదాయ శాఖను రద్దు చేసి, హిందూ ఆలయాలకు విముక్తి కల్గించాలని డిమాండ్ చేసారు. 

హిందూ ఆలయాలకు నష్టం కల్గించిన వారి నుంచే నష్ట పరిహారం వసూలు చేసి తిరిగి హిందూ ఆలయాల్లో ఆయా ఆస్తులను పూర్తి చేయాలన్నారు. గతం లో జరిగిన అన్ని

ప్రమాదాలకూ భాద్యులు ఒక మతిస్థిమితం లేని వాళ్ళు అంటూ దేవాదాయ శాఖ చేతులు దులుపేసుకుంది. ఈ ఒక్క మాట చెప్పడానికి దేవాదాయ శాఖా అవసరమా?, లక్షల్లో జీతాలు తీసుకునే వేలాది మంది ఉద్యోగులు అవసరమా? అని ప్రశ్నించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam