DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయ సాయి లాభదాయక పదవి అంశం లో అనర్హత కొట్టివేత

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 07, 2020 (డిఎన్ఎస్):* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యునిగా ఉన్న వి విజయసాయి రెడ్డి, మరొక అధికారిక పదవి అనుభవిస్తున్నారంటూ దాఖలైన అనర్హత పిటిషన్ ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్  కొట్టి వేశారు. సోమవారం ఈ దరఖాస్తు పై స్పందిస్తూ

అతని విషయంలో ఈ అనర్హత  వర్తించదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. లాభదాయక పదవి నిర్వహిస్తున్నారని ఫిర్యాదు పై కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం ఆయన తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధ క చట్టం, న్యాయస్థానాలు తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం  చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం మేరకు ఈ

అనర్హత పిటిషన్ను రాష్ట్రపతి కొట్టివేశారు. 

జి.ఓ.75 ప్రకారం ఏపీ ప్రభుత్వ  ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని విజయసాయి రెడ్డి ఇప్పడికే వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధినిర్వహణలో , ఏపీ  పర్యటన లో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నారని జి.ఓ లో స్పష్టీకరణ కారణంగా

కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam