DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ప్రభుత్వ హడావిడిగా తీసుకున్న నిర్ణయం తో ఇద్దరికి మనస్థాపం*

 కనగరాజ్ కు క్లిష్ట పరిస్థితి, పదవి పోయే. . ఇంటి అద్దె వాచిపొయే

*మాజీ ఎన్నికల కమిషనర్ ఫ్లాట్‌కు అద్దె ఎవరు కడతారు?* 

*కనగరాజ్ ఇంటి కి  6 నెలలు అద్దె రూ. 7 లక్షలు బకాయి*

*ఇంటి అద్దె ఇవ్వకుండానే ఖాళీచేసే ప్రయత్నంలో అధికారులు* 

*అధికారుల తీరుపై మండిపడుతున్న ఇంటి

ఓనర్‌*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 10, 2020 (DNS):* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట కు పోయి హడావిడిగా తీసుకున్న నిర్ణయం ఇద్దరినీ మస్తాపానికి, ఇరకాటానికి గురి చేసింది. విజయవాడ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఒక ఫ్లాట్ కు గత  6 నెలలుగా అద్దె చెల్లించక పోవడంతో అద్దె అడిగిన పాపానికి ఇంటి ఓనరు నానా

అవస్థలు పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే. . .

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకరంగా హడావిడిగా తమిళనాడు నుంచి కరోనా కష్టకాలం లో ఆఘమేఘాల మీద ఆంధ్రా కు తీసుకు వచ్చిన మాజీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ విజయవాడ బెంజిసర్కిల్‌.. దానికి సమీపంలో ల్యాండ్‌ మార్క్‌ ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌.. అందులోని డి-3

ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. దీనికి నెలకు  అద్దె రూ.1,11,800. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీన అద్దెకు దిగారు. నాటి నుంచి నేటి వరకూ అద్దె చెల్లించక లేదు. దీనికై ఫ్లాట్‌ ఓనర్‌ వల్లూరు రవీంద్రనాథ్‌కు సంబంధిత పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అద్దె చెల్లించవలసి ఉంది. ఇటీవల జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు

కొట్టివేసిన సంగతి తెలిసిందే.

అయితే అధికారిక ఉత్తర్వులు రద్దు కావడంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇంటి అద్దె చెల్లించే అవకాశం లేదు. పైగా ప్రభుత్వ పదవి లో లేరు కనుక, ఈ ఇంటి అద్దెతో తమకు సంబంధం లేదంటూ కొందరు వ్యాఖ్యానించడంతో ఇంటి ఓనర్ ఠారెత్తిపోయారు. 

కనగరాజ్ ప్రభుత్వం సమకూర్చిన సామాగ్రిని

స్వాధీనం చేసుకునేందుకు పంచాయితీ రాజ్ అధికారులు ఫ్లాట్ కు రావడంతో ఓనర్ అడ్డుకున్నారు. 
దీంతో ప్రభుత్వ అధికారులు బుధవారం ఆ ఫ్లాట్‌లోని ఫర్నిచర్‌ను తీసుకువెళ్లటానికి ప్రయత్నించారు. అయితే అద్దె బకాయి మొత్తం చెల్లించి ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని రవీంద్రనాథ్‌ సూచించారు. దాంతో వారు ఆయనపై మాచవరం పోలీసులకు

ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు. తమకు మొత్తం ఆరు నెలలుగా అద్దె కింద రూ.7 లక్షల వరకు ఇవ్వాల్సి ఉండగా.. అధికారులెవరూ స్పందించడం లేదని వాపోయారు. తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, సాధారణ ప్రజలమని.. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదన్నారు. అగ్రిమెంట్‌

లెటర్‌ ఇచ్చి ఫర్నిచర్‌ తీసుకెళ్లవచ్చని అధికారులకు చెప్పానని.. ఇక దీనిపై న్యాయస్ధానంలో చూసుకుంటామన్నారు.

కాగా.. అగ్రిమెంట్‌ లెటర్‌ ఇవ్వాలన్న రవీంద్రనాథ్‌ వినతిని సీఐ వినయమోహన్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు ఫర్నిచర్‌ తీసుకోకుండానే వెనుదిరిగారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam