DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ధర్మ పరిరక్షణ దీక్ష జనసేన శ్రేణులు సంఘీభావం

*భాగ్యనగరి లో పవన్, గ్రామా గ్రామాన పార్టీ శ్రేణులు దీక్ష*

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 10, 2020 (DNS):* రాష్ట్రం లో దేవాలయాలు, హిందూ వ్యవస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్మ పరిరక్షణ దీక్ష కు జనసేన శ్రేణులు సంఘీభావాన్ని ప్రకటించి నిరసన దీక్షలు చేపట్టారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నల్లని రిబ్బన్ ధరించి భాగ్యనగరం లోని తన ఇంట్లోనే దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఉదయం నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలను చదివారు. 

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు

పిలుపునిచ్చాయి. పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు శ్రేణులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాయి.
విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం, అనంతపురం,

కర్నూలు, తిరుపతి, చిత్తూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం విజయనగరం పట్టణాల్లో జనసేన నాయకులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.
అంతర్వేది రథం ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు. దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ

ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ దీక్షలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam