DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 14 నుండి నన్నయ వర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షలు

*పరీక్షల్లో పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు: వీసీ జగన్నాధరావు* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 11, 2020 (DNS):* ఈ నెల 14వ తేది నుండి డిగ్రీ మరియు పీజీ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో కోవిడ్ దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయం శుక్రవారం పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లుపై వీసీ మాట్లాడారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను 14వ తేది నుండి ప్రత్యేక ఏర్పాట్లు నడుమ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 139 పరీక్షా

కేంద్రాలను ఏర్పాటు చేసామని వీటిలో 113 డిగ్రీ పరీక్ష కేంద్రాలుగాను, 26 పీజీ పరీక్షా కేంద్రాలుగాను విభజించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అన్ని పరీక్ష కేంద్రాలను పూర్తిగా పరిశుభ్రపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా అన్ని పరీక్ష

కేంద్రాలకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం, శానిటైజర్లు, మాస్కులను విశ్వవిద్యాలయమే సరఫర చేస్తుందని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల సామర్ధ్యాన్ని బట్టి పరిశుభ్రతకు అవసరమైన వనరులను ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో ఇప్పటికే పంపించడం జరిగిందని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని

డిగ్రీ ఆరవ సెమిస్టర్ (ఫైనల్ ఇయర్) పరీక్షలు 23 వేల మంది వ్రాస్తున్నారని వీరిలో 13 వేల మంది సైన్స్ విద్యార్థులు, 10 వేల మంది ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. కోవిడ్ నేపధ్యంలో విద్యార్థులను భౌతిక దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు వేరువేరు గా పరీక్షలు నిర్వహిస్తున్నామని

తెలిపారు. డిగ్రీ సైన్స్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ, ఆర్ట్స్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని అన్నారు. డిగ్రీ బ్యాక్ లాగ్స్ విద్యార్థులకు 25వ తేది నుండి పరీక్షలు ఉంటాయని చెప్పారు. అలాగే పీజీ 4వ సెమిస్టర్(ఫైనల్ ఇయర్) పరీక్షలు ఉభయగోదావరి జిల్లాల్లోని 4200 మంది విద్యార్థులు

వ్రాస్తున్నారని అన్నారు. వీరిలో 2200 మంది ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులకు సెప్టెంబర్ 14వ తేది నుండి 24వ తేది వరకు, 2000 మంది సైన్స్ విద్యార్థులకు సెప్టెంబర్ 28వ తేది నుండి అక్టోబర్ 5వ తేది వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కోవిడ్ నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో సైన్స్, ఆర్ట్స్

విద్యార్థులకు వేరువేరు పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రుపొందించామని అన్నారు. కోవిడ్ కట్టడికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రూమ్ కి 12 మంది చొప్పున బెంచ్ కి ఒక్కరు చొప్పున పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద దర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మాస్క్ ఉన్న వారినే పరీక్ష గదిలోని

అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష గదిలోనికి వచ్చినప్పుడు పరీక్ష అనంతరం వెళ్ళినప్పుడు ప్రతీ విద్యార్థి చేతులను సేనిటేజర్లుతో శుభ్రం చేసుకోవాలని అన్నారు. ప్రతీ పరీక్ష తరువాత హైపోక్లోరైడ్ ద్రావనాన్ని పిచికారి చేయించి పరీక్ష కేంద్రాలను శుభ్రపరుస్తామని తెలిపారు. ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది వంటి వారు

మాస్కులు, గ్లౌజులు దరించి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక పరీక్ష గదిని ఏర్పాటు చేసామని తెలిపారు.

 

నన్నయ పరీక్షా విద్యార్థులకు హాస్టల్ వసతులు: . . .

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో పరిక్షలు వ్రాయబోతున్న విద్యార్థులకు హాస్టల్ వసతులను అందుబాటులో ఉంచుతున్నామని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు ముందురోజు హాస్టల్స్ కు వచ్చి పరీక్షలకు హాజరు కావచ్చునని చెప్పారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులు 14

తేదీ నుండి 24వ తేది వరకు పరీక్షలు వ్రాసి వెళ్ళిన తరువాత సైన్స్ విద్యార్థులు సెప్టెంబర్ 28వ తేది నుండి అక్టోబర్ 5వ తేది వరకు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఎప్పటికప్పుడు హాస్టల్స్ ను శెనిటేజ్ చేస్తామని అన్నారు. హాస్టల్ విద్యార్థులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించామని చెప్పారు. అన్ని రకాల కట్టుదిట్టమైన

ఏర్పాట్లు నడుమ పరీక్షలను నిర్వహిస్తున్నామని అందరూ వ్యక్తిగత బాధ్యతతో పరిక్షలను విజయవంతం చేయాలని తెలియజేసారు. పరీక్షల నిర్వహణ, పరిశుభ్రత ఏర్పాట్లు తదితర అంశాలను వీసీ తో పాటు రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్నేషన్ ఎస్.లింగారెడ్డి పర్యావేక్షిస్తున్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam