DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Vizag youngster Amrapali appointed Dy Secy to PM Modi

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2020 (డి ఎన్ ఎస్):* భారత ప్రధానమంత్రి డిప్యూటీ సెక్రెటరీగా విశాఖకు చెందిన యువ ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలి నియమితులయ్యారు. ఈమె విశాఖపట్నం లో పుట్టి, విద్యాభ్యాసం చేసి, చెన్నై ఐఐటి లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగుళూరు ఐఐఎం లో ఎంబీఏ దిగ్విజయంగా

సాధించారు. యూపీఎస్సీ 2010 లో నిర్వహించిన జాతీయ సివిల్ సర్వీసెస్ పోటీల్లో అత్యున్నత ప్రతిభను కనపరిచి ఆలిండియా 39th ర్యాంక్ ను సాధించి ఐఏఎస్ ను సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2013 లో ఐఏఎస్ అధికారిగా  వికారాబాద్ సబ్-కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర విభజన క్రమం లో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు.

అనంతరం ఆమె నిబద్దత పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను కేంద్ర హోం శాఖామంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రెటరీ గా బాధ్యతలు నియమించింది. అనంతరం నేరుగా భారత ప్రధానమంత్రి కార్యాలయం లో అవకాశం లభించిన ఆమ్రపాలి, ప్రధాని డిప్యూటీ సెక్రెటరీ గా పదోన్నతి పొందారు. ఈమెకు ట్రెక్కింగ్ చేయడం హాబీ. వికారాబాద్ పరిసరాల్లో సహచర

యువ ఐఏఎస్ ల తో కలిసి పలుమార్లు ట్రెక్కింగ్ కూడా నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam