DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధునిక సమాజ నిర్మాణానికి నిలువెత్తు రూపం మోక్షగుండం. . . 

*Sir MV, great architect of society, India has produced*

*ఆధునిక సమాజ నిర్మాణానికి నిలువెత్తు రూపం మోక్షగుండం. . .* 

*విశ్వేశ్వరయ్య. .  విశ్వానికి విశ్వ గురు భారత్ ఇచ్చిన బహుమానం* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 15, 2020 (DNS):* ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య... 15 సెప్టెంబర్ ఆయన జన్మదినం. ఆయన భారతరత్నగా అందరికీ తెలుసు. ఇంజనీర్ల పితామహుడు అని కీర్తిస్తుంటారు.  విశ్వేశ్వరయ్య గురించి భారతదేశమంతా తెలుసుకోవడం వేరు. ఆయన గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది వేరు. ఎందుకంటే... తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు... తరతరాలకు

గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగునేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ ఆయన.

సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య... సర్ ఎంవీగా పిలుస్తుంటారు. 1861 సెప్టెంబర్ 15న అప్పటి మైసూర్ సామ్రాజ్యంలోని చిక్కబళ్లపురలోని ముద్దెనహళ్లిలో జన్మించారాయన. ఇప్పుడా

ప్రాంతం కర్నాటకలో ఉంది. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్. కానీ 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు విశ్వేశ్వరయ్య. ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అంటే ఇప్పుడు కనీస అర్హతగా మారిపోయింది కానీ... ఆరోజుల్లో డిగ్రీ చదవడమంటే అదో గొప్ప విజయం. ఆ తర్వాత

పూణెలోని కాలెజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. బొంబాయ్‌లోనే కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరారు. అప్పుడే భారతదేశానికి ఓ మేధావి గురించి తెలిసింది.

విశాఖపట్నానికీ విశ్వేశ్వరయ్య సేవలు

హైదరాబాద్‌ను వరదలు అతలాకుతలం చేసినట్టు... ఆసయమంలో

విశాఖపట్నాన్ని సముద్రం చీల్చేస్తోంది. సముద్రపు కోతను ఎలా అడ్డుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే అందరికీ విశ్వేశ్వరయ్య గుర్తొచ్చారు. సముద్రపు కోత నుంచి తీరాన్ని రక్షించే వ్యవస్థను రూపొందించి విశాఖను కాపాడారు విశ్వేశ్వరయ్య. అంతేకాదు... ఇప్పటివరకు కోట్లాది మంది ప్రయాణించిన తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్డు

నిర్మాణానికీ ప్లాన్ రూపొందించింది కూడా ఆయనే. కావేరీ నదిపై ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్, బీహార్‌లో మొకామా బ్రిడ్జీ, ప్రభుత్వ సబ్బుల ఫ్యాక్టరీ, జోగ్ ఫాల్స్ దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, బెంగళూరు-మైసూర్ రైల్ రోడ్డు మార్గం నిర్మాణాల వెనుక విశ్వేశ్వరయ్య ప్రతిభే కారణం. సౌత్‌ బెంగళూరులోని జయనగర్‌ను పూర్తిగా

డిజైన్ చేసింది కూడా ఆయనే. ఆసియాలోని ఉత్తమ లేఅవుట్స్ అందించిన వ్యక్తిగా విశ్వేశ్వరయ్య పేరు తెచ్చుకున్నారు.

విశ్వేశ్వరయ్య కొంతకాలం మైసూర్ దివాన్‌గా పనిచేశారు. ఆయన సమయపాలన, నీతి, నిజాయితీ, విలువల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. దివాన్‌గా పనిచేసే సమయంలో విశ్వేశ్వరయ్య జేబులో రెండు పెన్నులుండేవి.

అందులో ఒకటి కార్యాలయానికి సంబంధించిన పెన్ అయితే రెండోది తన వ్యక్తిగత పెన్. అంటే ఆఫీసు పెన్నును కూడా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోనంత నిజాయితీ ఆయనది. అంతేకాదు ఆయన కార్యాలయానికి వచ్చే టైమ్ చూసి అందరూ గడియారాలు సరిచేసుకునేవారట. ఆయన సమయపాలన అలా ఉండేది.

ఏడేళ్లు దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య... 1927-1955 వరకు

టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఇంజనీర్‌గా భారతదేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు 1955లో భారతరత్న పురస్కారాన్ని అందించింది ప్రభుత్వం. నిండు నూరేళ్లు జీవించిన విశ్వేశ్వరయ్య... 1962 ఏప్రిల్ 14న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు మీద భారతదేశమంతా ఎన్నో విద్యాసంస్థలున్నాయి. ఇప్పటికీ ఆయన చేసిన సేవల్ని

గుర్తు చేసుకుంటారు ఈ తరం ఇంజనీర్లు. విశ్వేశ్వరయ్య పుట్టినరోజును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam