DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువ ఇంజనీర్లకు మోక్షగుండం జీవితం ఆదర్శం

*ఇంజనీర్సు డే లో జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడి* 

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 15, 2020 (DNS):* భారత దేశ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగ నిపుణుల పాత్రను ఎవరూ విస్మరించలేరని,  మన ఇంజనీరింగ్ నిపుణులకు మార్గ దర్శకులు  ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ని జనసేన అధ్యక్షులు

పవన్ కళ్యాణ్ తెలియచేసారు. మంగళవారం ఇంజనీర్సు డే వేడుకలను పురస్కరించుకుని, అయన ఇంజనీర్లకు సూచనలు అందించారు. స్వతంత్ర భారతావనిలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆలోచన చేసినా... ఏ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేపట్టినా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రస్తావన... వారి స్ఫూర్తి కచ్చితంగా ఉండి తీరుతుందన్నారు. సెప్టెంబర్ 15 న ఆ మహనీయుని

జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి గట్టెక్కించేలా నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. అలాగే విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడే విధానాన్ని అందించారు. దేశంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల

రూపకల్పనలో విశ్వేశ్వరయ్య భాగస్వామ్యం మరువలేనిదన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం వారి జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ వస్తోందన్నారు. ఈ రంగంలో ఉన్నవారందరికీ నా శుభాభినందనలు. విశ్వేశ్వరయ్య లోని తపన, దృఢ సంకల్పం... ఆయన జీవితం యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తాయి. మన దేశ

ఇంజనీర్లు అత్యుత్తమ నైపుణ్యాలతో పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో ముందుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam