DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లాలో ధర్నాలకు అనుమతి లేదు: ఏలూరు డిఐజి

*తూగో జిల్లాలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు లో ఉంది*     

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 17, 2020 (డి ఎన్ ఎస్ ):* తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో రథము కాల్చివేత ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, హిందూ ధార్మిక సంఘాలు, రాజకీయ

పార్టీల ప్రతినిధులు సంయమనం పాటించాలని ఏలూరు రేంజి డిఐజి కె.వి. మోహన్ రావు పిలుపునిచ్చారు. 
గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ తో కలిసి ఏలూరు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఐజి  మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి

దేవాలయం లో ఉన్న రథమును ఈ నెల 5 న అగ్నిప్రమాదం లో దగ్ధం అయినటువంటి విషయముపై వెంటనే  పోలీస్ వారు త్వరితగతిన స్పందించి,  సదరు కేసులో దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సైంటిఫిక్ అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు ఈ కేసులో ఇప్పటి వరకు 100 మంది సాక్షులను

విచారించి నట్లు, సదరు కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిబిఐకి వసిపరిచినట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వెంటనే స్పందించి భక్తుల మనోభావాలు దెబ్బతినే కూడదని లక్ష్యంతో 95 లక్షల రూపాయలు వ్యయముతో కొత్త రథము నిర్మించుట  కొరకు, 95 లక్షల రూపాయలను ప్రభుత్వం గ్రాంటు  చేసి  కొత్త రథము నిర్మాణం ప్రారంభించినట్లు

వివరించారు. 
అయితే  అంతర్వేది సంఘటనలో అరెస్టు చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇప్పటికే బెయిల్ పై విడుదల చేయడం జరిగిందని, కొంతమంది సోషల్ మీడియాలో చలో అమలాపురం, చలో అంతర్వేది కార్యక్రమములను నిర్వహించడానికి సన్నద్ధం అవుతూ పాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. 
కోనసీమ ఎంతో ప్రశాంతమైన

ఏరియాని అని, అక్కడ ప్రశాంతతను చెడగొట్ట వద్దు అని డీఐజీ ప్రజలకు మనవి చేసినారు, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు, చలో అమలాపురం చలో అంతర్వేది  కార్యక్రమమునకు పోలీసు వారు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని, అసాంఘిక, అరాచక శక్తుల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు ఎవరు

 ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కూడదని డి ఐ జి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam