DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొడాలి నాని వ్యాఖ్యలతో టిటిడి డొల్లతనం బయట పడింది

*గతంలో వైఎస్, జగన్ లతో డిక్లరేషన్ ఎందుకు తీసుకోలేదు.* 

*నాటి తప్పిదాలు టిటిడి అధికారులదే.. .వారిపై చర్యలు తీసుకోవాలి*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2020 (డి ఎన్ ఎస్):* తిరుమల లో అన్యమతస్తుల కోటాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ

మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి) అధికారులు గతం నుంచి చేస్తున్న తప్పిదం తెలిసి, డొల్లతనం బయట పడింది.*

దీనికి సమర్ధనగా అతను మరొక వ్యాఖ్యలు చేసారు. గతం లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గా, ప్రతిపక్ష నేతగా,

ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు తిరుమలకు వచ్చారని, అప్పుడు వైఎస్ ఆర్ తో ఎవ్వరూ తిరుమలలో డిక్లరేషన్ సంతకం తీసుకోలేదన్నారు. పైగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గతంలో నాలుగైదు సార్లు తిరుమలకు వచ్చారని, అప్పుడు కూడా ఎవ్వరూ అన్యమత డిక్లరేషన్ అడగలేదని, ప్రస్తుతం టిటిడి ఆహ్వానం మేరకు తిరుమలకు వస్తున్నా సమయంలో డిక్లరేషన్

ఎందుకు ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. 

అసలు డిక్లరేషన్ తీసుకోవాల్సిన భాద్యత ఎవరిదీ?:. . .

తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం హైందవేతరులు దర్శనానికి వచ్చిన సమయంలో వారి నుంచి స్వామి పై నమ్మకం ఉంది అనే సంతకం తీసుకునే సంప్రదాయం ఇప్పుడు మొదలైంది కాదు. వందల ఏళ్ళ నుంచి వస్తోంది. గతంలో అన్యమత ముష్కరులు హిందూ

ఆలయాలపై దాడులు జరిపిన సందర్భాల్లో ఆలయాల రక్షణతో పాటు, ఆలయానికి ఇతరులు ఎవరు వచ్చారో తెలుసుకునేందుకు కూడా ఈ డిక్లరేషన్ ఉపయోగపడుతుంది. ఇది వందల ఏళ్ళ నుంచి వస్తున్నా నిబంధన, బ్రిటిష్ పాలనా లో సైతం దీన్ని కటిచటంగా అమలు చేసారు. ఎందరో బ్రిటిష్ వారు డిక్లరేషన్ లో సంతకం చేసి మరీ స్వామి దర్శనానికి వెళ్లిన దాఖలాలు

ఉన్నాయి. 

వీటిని కచ్చితంగా అమలు చెయ్యవలసిన భాద్యత తిరుమల ఆలయ అధికారులదే తప్ప ప్రభుత్వానిది కాదు. ఈ పుస్తకం తిరుమల ఆలయంలోనే ఉంటుంది. దీనికి నిదర్శనమే గతం లో భారత రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలం కూడా ఈ పుస్తకంలో సంతకం చేసిన సందర్భాలు ఉన్నాయి. 

ఇది ఆలయ సంప్రదాయం. ఏ ఒక్కరి కోసమో ఆలయ సంప్రదాయాలు

మారవు, మార్చకూడదు. ఎలా పడితే ఆలా మారిస్తే అది సంప్రదాయం, నిబంధనలు కావు. 

గతంలో జరిగిన అన్ని తప్పిదాలకూ భాద్యులు టిటిడి అధికారులే తప్ప, పాలకులు కాదు. ఆలయం లో సక్రమంగా నిబంధనలు అమలు చెయ్యడానికే వాళ్లందరికీ లక్షల రూపాయలు జీతాలు ఇచ్చేది. వాళ్ళ విధులు నిర్వహించడం లో విఫలం అయ్యారు కనుక, వాళ్లపై కఠిన చర్యలు

తీసుకోవాల్సిన అవసరం ఉంది. ( రిటైర్ అయినా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు దోషులే. )

డిక్లరేషన్ చెయ్యడానికి ఎందుకు భయం:. .. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల కు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు, పైగా స్వాగతిస్తున్నారు. అయితే జన్మతః అతను అన్యమతస్తుడు కనుక, అందరి లాగానే ఇప్పుడు కూడా డిక్లరేషన్ పై సంతకం

చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇతను సంతకం చేస్తే. . .క్రైస్తవుణ్ణి అని అతనే స్వయంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇది చాల భయంకరమైన అంశం. ఎన్నికల ముందు విశాఖ శారదా పీఠాధిపతుల సారధ్యంలో ఇతను, తన అంతరంగికులతో కలిసి హృషీకేశ్ లోని గంగలో మునిగి హిందూ ధర్మంలోకి మారాను అని విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు

డిక్లరేషన్ పై సంతకం చేస్తే. . . 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను మోసగించాడన్న విషయం బయట పడుతుంది. 

చెయ్యక పొతే. . .: ఇతను హిందువుని గా మారినట్టు అతను స్వయంగా ప్రకరించినట్టే. అప్పుడు క్రైస్తవ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి తప్పదు. 

ఇప్పుడు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దీన్ని తప్పించుకోడానికి

కొడాలి నాని ని ప్రయోగించినట్టు తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam