DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోషల్ మీడియా లో రూమర్స్ పై చర్యలు తప్పవు: ఎస్పీ అమిత్ 

*(DNS report : SV Acharyulu, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, సెప్టెంబర్ 24, 2020 (డి ఎన్ ఎస్ ):* సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేసి, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఉపేక్షించేది లేదని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ హెచ్చరించారు. ఈ నెల 23 న శ్రీకాకుళం జిల్లా  కొయ్యాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఉన్న సరస్వతి

దేవి మందిరం యొక్క కుడి చేయి మరియు వీణను అన్య మతస్థులు విరగ గోట్టినట్లు సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టడంతో పాటు, హిందూ దేవీదేవతలు విగ్రహాలు ధ్వాంసం చేస్తున్నారు అనే ప్రచారం చేసినందుకు ధర్మవరం గ్రామానికి చెందిన ధర్మవరపు ఆచారీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాట్టు తెలిపారు. 

ఈ చుట్టుప్రక్కల విగ్రహాలను

ధ్వంసం చేయు ఉదంతాలు గత 15 నెలల నుండి ఇటువంటి సంఘటనలు చుట్టు ప్రక్కల గ్రామాలలో జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయినందున  కొయ్యాం వి ఆర్ ఓ కె సీతారామ్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసినట్టు తెలిపారు. నిందితుని నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam