DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పట్టాలకు పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలి 

*విశాఖ -నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సూచన*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2020 (డి ఎన్ ఎస్):* ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు పంపిణీ కి సంబంధించి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను గుర్తించేందుకు  సర్వే చేపట్టాలని విశాఖపట్నం జిల్లా

నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నర్సీపట్నం ,నాతవరం, కోటవురట్ల మండల తాసిల్దార్ లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లు, జిపిఎస్ సర్వేయర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
      ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ

తేదీన  గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో గ్రామ వీఆర్వో, అటవీ శాఖ రేంజ్ అధికారులు, ఐ టీ డీ ఏ  జీ పీ ఎస్ సర్వేయర్ల తో కూడిన బృందం ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల కొరకు గిరిజన కుటుంబాలు పెట్టుకొన్న దరఖాస్తు లను  క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం సంబంధిత లిస్ట్ లను తాసిల్దార్లకు అంద జేయాల్సి

ఉంటుందన్నారు. తహశీల్దార్లు కూడా లిస్టు లను పరిశీ లించి  సర్టిఫై చేయాలన్నారు. చట్ట విరుద్ధంగా గిరిేజనేతరులకు ఇవ్వరాదన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టి కి వస్తే సంబంధిత తాసిల్దాదార్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
        ఈ సమావేశంలో నర్సీపట్నం , కోటవురట్ల , నాతవరం తాసిల్దార్ లు  జయ,

రామారావు , జానకి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి, మూడు మండలాల వీఆర్వో లు, ఐటీడీఏ జీ పీ ఎస్ సర్వేయర్లు, ఫారెస్ట్ రేంజ్ బీట్ అధికార్లు తదితరులు హాజరయ్యారు.v

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam