DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సాపురం టిడిపి చీఫ్ తోట సీతారామలక్ష్మికి శుభాకాంక్షలు 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్ ):* పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలిగా ఎన్నికైన తోట సీతారామలక్ష్మికి భీమవరం నియోజకవర్గ టిడిపి నాయకులు శుభాకాంక్షలు తెలియ చేసారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్

అధ్యక్షురాలిగా నియమితులైన సీతారామలక్ష్మిని కలిసి వారు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  భీమవరం మున్సిపల్  చైర్ పర్సన్ గా రాజ్యసభ సభ్యునిగా, 11 సంవత్సరాలుగా పశ్చిమగోదావరిజిల్లా  టిడిపి అధ్యక్షురాలు గా నన్ను  ఎంపిక చేసి పదవీ

బాధ్యతలు అప్పగించారని ఆ బాధ్యతలను నిష్పక్షపాతంగా, అత్యంత క్రమశిక్షణతో బధ్యతాయుతంగా పదవులు నిర్వహించిన నాకు తిరిగి నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో రానున్న అన్ని ఎన్నికల్లో  విజయం  సాధించడానికి శక్తివంచన

లేకుండా  కృషి చేస్తానని కార్యకర్తలు,నాయకులు అందరూ కలిసి 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేలా కష్టించి పని చేయాలన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు గా నియమితులైన తోట సీతారామలక్ష్మి  రాష్ట్రంలో టిడిపి అధికారంలో తీసుకువచ్చే విధంగా పని చేస్తారని

అందుకు  ప్రతి కార్యకర్త ఐక్యమత్యంతో వారి ఆదేశాలను పాటించాలన్నారు. టిడిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మేరగాని నారాయణమ్మ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా భీమవరం మున్సిపల్ చైర్ పర్సన్ గా తోట సీతారామలక్ష్మి ఎంతో నీతి నిజాయితీగా పరిపాలన కొనసాగించిన వారికి తిరిగి నరసాపురం పార్లమెంట్

బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర టిడిపి మహిళా విభాగం తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పటల్ మాజీ చైర్మన్ మామిడి శెట్టి ప్రసాద్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వేండ్ర శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎండి సబీనా బేగం, ప్రధాన కార్యదర్శి మాదాసు

కనకదుర్గ, గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ సయ్యద్ నసీమా బేగం, పట్టణ యువత అధ్యక్షుడు మద్దుల రాము, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు గంటా త్రిమూర్తులు,కార్యదర్శి ఈపిశేషు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎం. గున్నెస్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు జంపన్న ధనరాజ్, సతివాడ హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్,మాజీ

కౌన్సిలర్లు చల్లబోయిన సుబ్బారావు, మైలబత్తుల ఐజాక్ బాబు, పంతం వెంకట సతీష్, ఎండి ఫిరోజ్,ఎస్సీ సెల్ కార్యదర్శి మరపట్ల శ్యాంబాబు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి చల్లబోయిన గోవింద్, నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, పి సూర్యనారాయణ రాజు, నేదునూరి గంగాధర్, దొంగ వెంకటేశ్వరరావు, వేమవరపు శ్రీనివాస్, పడమట సోమేశ్వర రావు,  సోషల్

మీడియా మెంబెర్స్ కడలి వాసు, కోళ్ల నాగబాబు, తదితర నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam