DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టేబుల్ టెన్నిస్ శర్మ కు కామన్వెల్త్ వర్సిటీ పీహెచ్ డి డాక్టరేట్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్): విశాఖ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ కు టోంగా లోని కామన్వెల్త్ ఒకేషనల్ విశ్వ విద్యాలయం డాక్టరేట్ అందించింది. స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ విభాగం లో టేబుల్ టెన్నిస్ ఆట ద్వారా ఆరోగ్య పరిరక్షణ, బ్రెయిన్

ఫంక్షన్ లో పరిశోధనలు నిర్వహించినందుకు గాను విదేశీ విశ్వ విద్యాలయం శర్మ కు పిహెచ్ డి పట్టాను అందించింది. క్రీడా రంగానికి సంబంధించి, విద్యాపరమైన ప్రోత్సాహకం తో పాటు, మెళకువలను అందించగలిన సంస్థ ఇది. 

శర్మ జీవన బీమా సంస్థ విశాఖ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ, జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ద్వారా విశాఖ

జిల్లాలో ఎందరో యువ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు యోగ్యతా సంపాదించేలా మెరుగైన శిక్షణ అందిస్తున్నారు. 

శర్మ పలు అంతర్జాతీయ టోర్నీల్లో సీనియర్ క్రీడాకారునిగాను, ఎంపైర్ గాను, ఎన్నో సేవలందించారు. భారత క్రీడా సంస్థ టేబుల్ టెన్నిస్ సంఘం కోచ్ ఎడ్యుకేషన్ కోర్సులోనూ ఉత్తీర్ణత

 సాధించారు. 

శర్మ కు డాక్టరేట్ లభించిన సందర్బంగా ఎల్ ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎల్ కె పట్నాయక్, ఎల్ ఐ సి ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్. రమణాచలం, ఇతర ఉద్యోగులు, జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ప్రతినిధులు, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam