DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొమ్మన భారతి మృతి పట్ల శ్రీఘాకోళ్ళపు దిగ్భ్రాంతి

*మరణం లోనూ వీడని బంధం : పాత్రికేయులు పి. రాజా* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 03, 2020 (డి ఎన్ ఎస్ ):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజ్ కుమార్ మరణించిన వార్తను జీర్ణించుకోలేక రోజూ బాధపడుతున్న సమయంలో ఆయన సతీమణి బొమ్మన భారతిదేవి మరణించడం

పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ సిటి కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో పార్టీకి, దేవాంగ కుటుంబాలకు బలమైన నాయకుడిగా ఉన్న బొమ్మన రాజ్ కుమార్ మరణం అందరిని కలచి వేసిందని,ఆ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బొమ్మన భారతీదేవి ఆరోగ్యంగా వస్తారని అంతా

భావించామని,అయితే ఆమె కూడా కన్నుమూయడం తట్టుకోలేకపోతున్నామని అన్నారు. తండ్రిని కోల్పోయి దుఖః సాగరంలో ఉన్న బొమ్మన కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోకముందే మళ్ళీ ఈ మరణవార్తను వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం కష్టతరమన్నారు.ఆ భగవంతుడు వారికి మనోధైర్యం కలిగించాలని సుబ్రహ్మణ్యం కోరారు.బొమ్మన భారతిదేవి మృతిపట్ల వైయస్సార్

కాంగ్రెస్ పార్టీ తరపున, వ్యక్తిగతంగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు.వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

మరణం లోనూ వీడని బంధం : సీనియర్ పాత్రికేయులు రాజా  

భర్త పై అభిమానం, ఆయన ఇక లేరని బెంగతో , మళ్లీ జన్మంటూ వుంటె ఆయనకే దర్మచారిణి గా ఉండాలని అనుకుందేమో ఆ

సాధ్వి! అందుకే భర్త వెంటే తాను కూడా కైలాసానికి చేరుకుందని సీనియర్ పాత్రికేయులు పెంటపాటి రాజా తెలిపారు. 

వస్త్ర వ్యాపార రంగంలో మకుటం లేని మహారాజు బొమ్మన రాజ్ కుమార్ సెప్టెంబర్ 1 న మరణించారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన సతీమణి భారతి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఏ పుణ్యస్త్రీ అయినా తాను పునిస్త్రీ

గా వెళ్లాలని అనుకుంటుంది. అయితే బొమ్మన దంపతులు ముందుగా అనుకున్నారేమో! బొమ్మన రాజ్ కుమార్ గతించిన 32 రోజుల తర్వాత భారతి కూడా భర్త వెంటే వెళ్లారు. తన భర్త ఉన్నతిలో, కష్టసుఖాల్లో, చివరికి మరణం లో, వెన్నంటి ఉన్న బొమ్మన భారతి కి నివాళులు అర్పిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam