DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఎంతో  ఘనకీర్తి విశాఖ పోర్ట్ ట్రస్ట్ సొంతం.: చైర్మన్ రామ్మోహన్*

2019-20 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా
 
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2020 (డి ఎన్ ఎస్):* ఎన్నో దశాబ్దాల చరిత్ర కల్గిన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దేశ ప్రతిష్టను పెంచే రీతిలో ఎన్నో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహన్ రావు తెలిపారు.

ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి సరుకును రవాణా చేసింది.  2018 -19 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ చేసిన 65.30 మిలియన్ టన్నుల తో పోల్చుకుంటే 2019-20 ఆర్ధిక

సంవత్సరంలో చేసినసరుకు రవాణా 11 శాతం అధికం.

సరుకు రవాణా పై కోవిడ్-19 ప్రభావం :

భారత దేశంలోని మేజర్ పోర్టులు అన్నీ కలిపి 2020 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు 245 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయి. ఇదే 2019 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 294 మిలియన్ టన్నుల సరుకును 12 మేజర్

పోర్టులు కలిసి చేశాయి.

గత ఏడాది ఇదే సమయానికి (ఆర్ధిక సంవత్సరం తొొలి అర్ధభాగం) సరుకు  రవాణా తో పోల్చుకుంటే 16.5 శాతం తక్కువగా నమోదైంది

విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగంలో 32.77 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి  34.75 మిలియన్ టన్నుల సరుకు

రవాణా చేసింది.

గత ఆర్థిక సంవత్సరం తో పోల్చుకుంటే ఈ ఏడాది మొదటి అర్ధ భాగం లో 1.98 మిలియన్ టన్నుల తక్కువ సరుకు రవాణా జరిగింది. గత ఏడాది తొలి అర్ధ భాగంతో పోల్చుకుంటే ఇది 5.7 శాతం తక్కువ.

సరుకు రవాణాలో  తగ్గుదల పరంగా చూసుకుంటే మిగిలిన అన్ని మేనేజర్ పోస్టుల కంటే కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తక్కువ

తగ్గుదలను నమోదు చేసింది.

2019 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మొత్తం 1056 వెసెల్స్ ను హ్యాండిల్ చేసింది. అదే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 1016 వెసెల్స్ ను చేసింది.

ఆర్థిక మందగమనం కారణంగా విద్యుత్ రంగానికి సంబంధించిన ముడి సరుకు రవాణాలో

చెప్పుకోదగిన తగ్గుదల నమోదైంది. స్టీమ్ విభాగంలో స్టీమ్ కోల్, పెట్రోలియం సెక్టార్ లో కుకింగ్ కోల్, పెట్రోలియం రంగంలో ముడి చమురు కంటైనర్ సరుకు రవాణాలో తగ్గుదల నమోదైంది.

ఇనుప ఖనిజం,  పెల్లెట్స్,  TANGEDCO కు సముద్రమార్గం ద్వారా బొగ్గు రవాణా, ఎరువులు, ఇనుము, కంటైనర్ ఎగుమతుల్లో వృద్ది నమోదు

అయ్యింది.

ఆస్ట్రేలియా బ్రెజిల్ దేశాలలో ఇనుప ఖనిజం ఉత్పత్తి తగ్గడంతో చైనా , భారత్ నుంచి ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇనుప ఖనిజం ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది.

చైనా, సౌత్ కొరియా, జపాన్ లో నుంచి స్టీల్ కు డిమాండ్ ఉండటంతో ఎగుమతుల్లో వృద్ధి

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం

చేస్తున్న నిరంతర కృషితో ఎరువుల ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోంది

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కారణంగా కంటైనర్ రవాణాలో వృద్ధి నమోదు

ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడంలో రైల్వేల పరంగా టెర్మినల్ చార్జెస్ లో రిబేటు ఇవ్వటం వంటి చర్యల వల్ల ఇనుప ఖనిజం ఎగుమతుల్లో వృద్ధి

ప్రధాన మార్గంలోని వెస్సెల్స్ కు

ప్రత్యేక రిబేటు ఇవ్వడం వంటి చర్యలు

ఈ.క్యూ 7 బెర్త్ ను క్రేన్ రహిత బెర్త్ గా వినియోగం. దీని వల్ల క్రేన్ ల ద్వారా నిర్వహించే బెర్త్ ల కంటేతక్కువ ఖర్చులు. విద్యుత్ క్రేన్ లు లేకుండా సరుకు రవాణా చేసే వాణిజ్య వేత్తలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  విధానం
పోర్టు కమ్యూనిటీ

సిస్టం మాడ్యూల్ ను (PCS 1X) ఇంప్లిమెంట్ చేయడం
అవసరం అనుకున్న వారికి ఆన్ లైన్ ద్వారా డాక్యుమెంట్లను  సమర్పించే అవకాశం
పోర్టు నుంచి  వాహనాలను త్వరగా తరలించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ విధానాన్ని అమలు చేయడం

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ధరలను సరళీకరణ చేయడం
డాక్యుమెంట్లను త్వరగా

పూర్తి చేసేందుకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సమన్వయకర్తగా ICEGATE  ఐటి  పోర్టల్ అందుబాటులోకి 
కంటైనర్లు నేరుగా పోర్టులోకి ప్రవేశించి, సరుకు డెలివరీ చేసే విధానం అందుబాటులోకి
రాత్రి సమయంలో నావిగేషన్ కు వీలు కల్పించేలా  పనామాక్స్ వెలెల్స్ యొక్క  డ్రాఫ్ట్ ను 14 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచటం

ఇన్నర్

హార్బర్ లో వెసెల్ యొక్క భీమ్ ను  32.5 మీటర్ల నుంచి 38 మీటర్లకు పెంచటం

కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు

పోర్టులలో సరుకు రవాణా మరియు సరుకు నిల్వలను అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకురావడం

లాక్ డౌన్ ను సమయంలో రవాణా నిరంతరం జరిగే విధంగా విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ కోవిడ్-19

నిబంధనలను అనుసరించి అనేక చర్యలు చేపట్టింది

ప్రాధమిక ఆరోగ్య అధికారి షిప్ లోని సిబ్బందిని పరిశీలించిన తరువాత  హార్బర్ మాస్టర్ మరో మారు పరిశీలించి దానిని అంగీకరించిన తర్వాత మాత్రమే హార్బర్ లో కి షిప్ లను అనుమతించటం

షిప్పు లోని సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ షిప్ నుంచి  కిందకి దిగడానికి

 అనుమతి లేదు. అవసరమైన  సిబ్బంది మాత్రమే తక్కువ సంఖ్యలో  నిర్దేశిత పిపిఈ కిట్లను ధరించి, సరైన శానిటేషన్ ప్రక్రియపూర్తిచేసుకున్న తరువాత మాత్రమే షిప్పులలోనికి అనుమతి

 ప్రామాణిక నిర్వహణ వ్యవస్ధ అమలు పరిచారు

పైలట్లకు పూర్తి రక్షణ కల్పించే విధంగా శరీరాన్ని పూర్తి కప్పి ఉంచేలా సూట్, మరియు

స్టెరిలైజ్ చేసిన హ్యాండ్ గ్లౌజులు ఎన్ 95 మాస్కల అందజేత

షిప్పింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారికి త్రిబుల్ లేయర్ మాస్క్  అందజేత

పోర్టు లోని అన్ని కార్య నిర్వాహక ప్రదేశాలలో చేతులను  పరిశుభ్రం చేసుకునేందుకు సదుపాయాలు, సోప్ క్రిమి సంహారక మందుల ఏర్పాటు

విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ కు

సంబంధించిన అన్ని భవనాలను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో నిర్దేశిత సమయాలలో పిచికారీ చేయడం

కోవిడ్ కేర్ కేంద్రంగా పోర్ట్ మైదానం :. . . 

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగుల కోసం పోర్టు స్టేడియంలోని ఇండోర్ స్టేడియం, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ మరియు కోవిడ్ చికిత్స కేంద్రం గా మార్పు చేసారు. కోవిడ్ కేర్

సెంటర్ లో 63 బెడ్ ల ఏర్పాటు చేసారు. కోవిడ్ నిర్ధారణ కోసం కోవిడ్ కేస్ సెంటర్ లో ర్యాపిడ్ యాంటింజెంట్ టేస్ట్ సదుపాయం కల్పించారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు. 

ఆక్సిజన్ స్థాయి లో 95, 94 కంటే తక్కువ ఉన్న పేషెంట్లను అత్యాధునిక వసతులు, వెంటిలేటర్ సదుపాయం ఉన్న

ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. 

కోవిడ్ కేర్ సెంటర్ లోని అన్ని బెడ్ లకు ఆక్సిజన్, వేపరైజర్, పల్స్ ఆక్సీ మీటర్, ధెర్మోమీటర్  మొబైల్ ఛార్జింగ్ సదుపాయాల కల్పన ఉంది. 

కొవిడ్ కేర్ సెంటర్ వద్ద 24 గంటలు అందుబాటులో అంబులెన్స్ సేవలు, కోవిడ్  కేర్ సెంటర్ వద్ద అందుబాటులో ఈసీజీ పరికరం

ఉంది. 

అత్యవసర పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొొనేందుకు కొవిడ్ కేర్ సెంటర్ వద్ద అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంది. 

కోవిడ్ కేర్ సెంటర్ వద్ద పాటించే విధానాలు :

ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాణాయామం, తదుపరి బ్రేక్ ఫాస్ట్
మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం, మధ్యాహ్నం స్నాక్స్, రాత్రి 8:30 కి

భోజనం, పేషెంట్లకు రోజు రెండు గుడ్ల తో పాటు ప్రోటీన్ తో కూడిన డైట్, పేషెంట్లు చూసేందుకు వీలుగా టీవీలు ఏర్పాటు చేసారు. 

మెడికల్ టీం నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సీసీటీవీ ఏర్పాట్లు ఉన్నాయి. 

అమ్మోనియం నైట్రేట్ నిర్వహణ: 
విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఎరువుల గ్రేడ్ లో  వినియోగించే

అమోనియం నైట్రేట్ ను బ్యాగులో దిగుమతి చేసుకుంటారు

చట్టపరమైన ఏజెన్సీ ల అనుమతుల తర్వాత మాత్రమే అమ్మోనియం నైట్రేట్ ను దిగుమతి చేసుకునేందుకు విశాఖపట్టణం పోర్ట్ ట్రస్టు అనుమతిస్తుంది

అమ్మోనియం నైట్రేట్ కు సంబంధించి విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ ఎటువంటి స్టోరేజి సదుపాయమ కల్పించదు.  అమ్మోనియం

నైట్రేట్ సంచులలో దిగుమతి అయిన, వెను వెంటనే  సంబంధిత ఏజెంట్లు   సరుకును అక్కడ నుంచి తరలించాలనే నిబంధన మేరకు అమోనియం నైట్రేట్ ను అనుమతించబడుతోంది

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే వారి కోసం 29 పాయింట్ల నిబంధన జాబితాను రూపొందించి దానిని తప్పని సరిగా అమలు చేయాలని దిగుమతి

దారులకు నిబంధనలు విధించింది.

అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు

అమ్మోనియం నైట్రేట్ ను దిగుమతి చేసుకునే సమయంలో బెర్త్ మొత్తాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతారు

అభివృద్ధి ప్రాజెక్టులు: . . .

633 కోట్ల రూపాయలతో తో నిర్మిస్తున్న

కంటైనర్ టెర్మినల్ విస్తరణ కార్యక్రమం పురోగతిలో ఉంది 2021 మార్చి నాటికి విస్తరణ కార్యక్రమం పూర్తి కావలసి ఉండగా కోవిడ్ 19 కారణంగా కొంత ఆలస్యం అవుతుంది ఈ విస్తరణ పూర్తయితే కంటైనర్ టెర్మినల్ అదనంగా మరో 5.4 లక్షల TEUs  రవాణా చేయనుంది.

168 కోట్ల రూపాయలతో చేపట్టిన OR 1 మరియు OR 2 బెర్తుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి ఈ

బెర్తుల ఆధునీకరణ వల్ల అదనంగా ఆయిల్ హ్యాండిల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది 2022 మార్చి నాటికి ఆధునికీకరణ పనులు పూర్తవుతాయి ఆధునికీకరణ పూర్తయితే ఈ టెర్మినల్ ద్వారా 80 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంకర్లను నిర్వహించే వీలు కలుగుతుంది

2021 జనవరి నాటికి వెస్ట్ క్యూ7 అండ్ 8 బెర్త్ ల పైన లైసెన్సింగ్ విధానంలో

వంద టన్నుల సామర్థ్యం కలిగిన రెండు హెచ్ ఎం సి ఏ క్రేన్  ఏర్పాటు. 2021 ఫిబ్రవరి నాటికి ఈక్యూ 3, ఈక్యూ 4 బెర్త్ లపై  మరో రెండు, వంద టన్నుల కెపాసిటీ కలిగిన హెచ్ ఎం సి ఏ క్రేన్ ల ఏర్పాటు

భారీగా సరుకు ను నిల్వ  చేసేందుకు విడతల వారీగా కవర్డ్ స్టోరేజ్ షెడ్స్ నిర్మాణం. తొలివిడతలో అభివృద్ధి చేయనున్న కబోర్డు స్టోరేజీ

షెడ్ కోసం 36 కోట్లు కేటాయింపు. ఇది 2021నాటికి పూర్తవుతుంది

రెండు వందల ఎనభై నుంచి 300 కోట్ల రూపాయలతో వెస్ట్ క్యూ7,8 బెర్త్ ల యాంత్రీకరణ

ఈ క్యూ 7 బెర్తు యాంత్రీకరణ

77 కోట్ల రూపాయలతో క్రూయిజ్హూ టెర్మినల్ అభివృద్ధికి చర్యలు

180 కోట్ల రూపాయలతో సి హార్స్ జంక్షన్ నుంచి డాక్టర్ ఏరియా వరకు నాలుగు

కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ అభివృద్ధికి చర్యలు. డీపీఆర్ తయారీ దశలో ఉంది

110 కోట్ల రూపాయలతో ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి చి నాలుగు లైన్ల కనెక్టివిటీ రహదారి అభివృద్ధికి డి పి ఆర్ తయారీ దశ

మేజర్ స్పోర్ట్స్ అధారిటీ బిల్

మేజర్ పోర్టు అథారిటీ బిల్లు 2020 స్వాగతించదగినది.

మారుతున్న

 మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆస్తులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పోర్టులకు మంచి అవకాశం కల్పిస్తోంది

పెట్టుబడి ఖర్చులను లేదా నిర్వహణా మూల ధన అవసరాల కోసం పోర్టు సెక్యూరిటీలను ద్వారా  జాతీయ బ్యాంకుల నుంచి బహిరంగ మార్కెట్లో దేశంలోపల లేదా వెలుపల లోన్లు తీసుకునేందుకు అవకాశం

కలుగుతుంది

కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలను అందించేందుకు పోర్టు లకు అవకాశం కల్పిస్తుంది

ఈ బిల్లు పోర్టులతో పాటు అక్కడ నిర్వహించే ప్రైవేటు టెర్మినల్స్ నిర్వాహకులకు కూడా మేలు కల్పిస్తుంది

దేశంలోని నాన్ మేజర్ పోర్టులతో సమర్థవంతంగా పోటీ పడేందుకు ప్రభుత్వ రంగ పోర్టులకు మంచి

బలాన్నిస్తుంది.

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రాయితీలు ఇచ్చేందుకు వెసలుబాటు కలుగుతుంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam