DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టుల సంక్షేమమే ఏపీ ప్రెస్ అకాడమీ లక్ష్యం 

*సంక్షేమానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు*

*ఫేక్ జర్నలిస్టుల తొలగింపు తరువాతే పథకాల వర్తింపు* 

*వీజెఎఫ్ మీట్ ద ప్రెస్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్* 

*కోవిడ్ ఫ్రంట్ వారియర్సుగా జర్నలిస్టులను గుర్తించాలి* 

*రూ .50 లక్షల హెల్తు ఇన్సూరెన్సును

వర్తింపజేయాలి* 

*అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి: విజెఎఫ్* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 12, 2020 (డి ఎన్ ఎస్):* జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ లక్ష్యమని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు .

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు . సోమవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ జర్నలిస్టుల తొలగింపు ప్రస్తుతం జరుగుతుందన్నారు . ఆ తరువాత జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆయన వెల్లడించారు . జర్నలిస్టుల అక్రిడేషన్

కార్డుల జారీ ప్రక్రియ జాప్యంకు అది కూడా ఒక కారణం అన్నారు . వీజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పలు విషయాలను ప్రస్తావించారు . పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలి చ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ప్రభుత్వం కోసమో , ప్రభుత్వం

తరపునో పనిచేస్తుందని భావించవద్ద న్నారు . గతంలోని ప్రెస్ అకాడమీ చైర్మన్లు వారి కారణాల దృష్ట్యా జర్నలిస్టులకు మేలు పూర్తిగా చేసి ఉండకపోవచ్చని , తాను జర్నలిస్టుగానే మెలిగిన జర్నలిస్టుల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా మంచి చేయాలనే తలంపుతోనే ఉన్నట్లుగా శ్రీనాథ్ వెల్లడించా రు అందులో భాగంగానే తాను ఛైర్మన్ అయ్యాక

జర్నలిస్టులకు శిక్షణా తరగతులు కోవిడ్ దృష్ట్యా జూమ్ లోనే మొదట విశాఖ పట్నం లోనే నిర్వహించానన్నారు . ఇక్కడి జర్నలిస్టులు బాగా స్పందించి సహకరించారన్నారు . రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకూ వర్తింపజేసి , తిరిగి ప్రత్యక్షంగా కలసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు . జర్నలిస్టుల సమస్యలన్నిటి పట్లా తాను అందు

బాటులో ఉంటానని , అకాడమీ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు . నైపుణ్యం ఉంటేనే జర్నలిస్టులు ఇప్పుడు న్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే రాణింపు సాధ్యమవుతుందన్నారు . ఆ దశగా శిక్షణ నిపుణులతో జర్నలిస్టులకు ఇప్పించే ప్రక్రియ జరుగుతుందన్నారు . ఇందులో భాగంగా పలు పుస్తకాలను జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా ముద్రించి

సిద్ధం చేసామని చెప్పారు . జర్నలిస్టులు రాసే వార్తాంశాలు నిజ నిర్ధారణ చేసుకునే రాయాలని , ఫేక్ కథనాలు కూడదన్నారు . వివిధ శాఖలు అందించే పథకాలను , వాటిని జర్నలిస్టులు ఉపయోగించుకుని వార్తాంశాలు మలచుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్ను రూపొందించి అందుబాటులోకి తెస్తున్నట్లుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి

శ్రీనాథ్ ప్రకటించారు . ఇది గ్రామీణ జర్నలిస్టులకు అత్యంత ప్రయోజనకరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు . జర్నలిస్టు యూనియన్ల మధ్య పోరాట ధోరణి , వ్యతిరేక ధోరణి ఉండడం వల్ల జర్నలిస్టులు నష్టపోతున్నారని ఆయన చెబుతూ వైజాగ్ జర్నలిస్టు ఫోరంలా యూనియన్లకు అతీతంగా కలిసి కార్యక్రమాలు చేసుకోగలిగితే సంక్షేమం సాధించుకోవడం కష్టం

కాదన్నారు . వీజేఎఫ్ యూనిటీని ఇతర జిల్లాల ప్రెస్ క్లబ్ లకూ తాను ఉదాహరణగా వివరిస్తానని చెప్పారు . బోగస్ జర్నలిస్టులను ఏరివేస్తే , తాను జర్నలిస్టులకు మంచి చేసేందుకు సిద్ధమేనని తన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి స్పందించారని , ప్రస్తుతం ఫేక్ జర్నలిస్టుల ఏరివేత జరుగుతుందన్నారు . అందువల్లనే అక్రిడేషన్ల మంజూరులో జాప్యం

జరుగుతుందని దేవిరెడ్డి శ్రీనాథ్ స్పష్టం చేశారు . జర్నలిస్టుల ముసుగాలో జరుగుతున్న దందాలను తొలగిస్తా మన్నారు . టెక్నాలజీ దాడి నుంచి జర్నలిస్టులు రక్షించుకోవడానికి తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు 

సభకు అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టు ఫోరం

అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కోడ్లో విశేష సేవలందించిన జర్నలిస్టులనూ కోవిడ్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించేలా ప్రెస్ అకాడమీ చైర్మన్ కృషి చేయాలని కోరారు . హెల్తు ఇన్సూరెన్సు  రూ .50 లక్షల రూపాయలు వర్తించేలా దోహదపడాలని కోరుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు జరిగేలా ప్రభుత్వంను ప్రెస్

అకాడమీ చైర్మన్ సహకరించాలని ప్రతిపాదించారు . వైజాగ్ జర్నలిస్టు ఫోరం దేశంలోని ఇతర ప్రెస్ క్లబ్ లకు ఆదర్శంగా జర్నలిస్టుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాద్ కు వివరించారు . అందరి సహకారంతో 11 దేశాల్లో ఏజేఎఫ్ సన్నిహిత సంబంధాలు , కార్యకలాపాల అనుసంధానం ఉందన్నారు . దేశ

వ్యాప్తంగా ఉన్న ప్రెస్ క్లబ్లతో ఉన్న అనుసంధానం చివరించారు . వీజేఎఫ్ కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ వివిధ జిల్లాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులతో నిర్వహించిన , నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లు వంటివి ఛైర్మన్ ముందు ఆవిష్కరించారు . ఇక మీదట జరిగే క్రీడల్లో శ్రీనాథ్ స్వయంగా పాల్గొని ఆశీర్వదించాలని కోరారు .

కార్యక్రమంలో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను ఉచిత రీతిన సత్కరించారు 

. వీజేఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి . నానాజీ , జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ , కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు , ఎంఎస్ఆర్ ప్రసాద్ , దివాకర్ ,

వరలక్ష్మి గయాజ్ , శేఖరమంత్రి తదితరులు పాల్గొన్నారు . కార్యక్రమంలో భాగంగా ఆడీడీ మణిరామ్ , డీపీఆర్‌వో వెంకట రాజు గౌడు వీజేఎఫ్ సభ్యులు ఉచిత రీతిన సత్కరించారు .

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam