DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలపై అఘాయిత్యాలు చేసే వారిపై కఠిన చర్యలు 

*దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ హెచ్చరిక.  .*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 16, 2020 (డి ఎన్ ఎస్ ):* విజయవాడలో  ప్రేమోన్మాది ఘాతుకం ఘటన చాలా బాధాకరం అని దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి , భాదితురాలి కుటుంబ సభ్యులతో

మాట్లాడామన్నారు. ఈ కేసులో నిందితుడిపైన దిశ  స్ఫూర్తిగా ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అని తెలిపారు.ఇటువంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉపేక్షించేది లేదన్నారు. సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను

అరికట్టాల్సిన భాద్యత మన అందరిపైనా ఉందనారు. మీకు తెలిసిన ఎటువంటి సమాచారాన్ని అయిన అందించేందుకు దిశ యాప్, పోలీస్ సేవ యాప్ , డైల్ 100/112 అన్ని వేళల అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళ రక్షణే పోలీసుల ప్రధమ కర్తవ్యం,నేరాలకు  పాల్పడినవారిని ఎట్టిపరిస్థితులలోను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam