DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాహనం పై రోడ్డెక్కుతున్నారా అయితే బహుపరాక్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 21, 2020 (డి ఎన్ ఎస్):* మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా, ఇతర వాహనాలకు మరింత అధిక

జరిమానా అమలు లోకి రానున్నాయి. 

జరిమానాలు.......

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750 

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750 

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత

లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

వేగంగా బండి నడిపితే - రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ.

2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్  కోసం ఆపక పోయినా - రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి

వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి - రూ. లక్ష
 
పైన తెలిపిన జరిమానాలు పటిష్టంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam