DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్ విధి నిర్వహణపై డిజిపి వీడియో సమావేశం

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 22, 2020 (డి ఎన్ ఎస్ ):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఏలూరు రేంజ్ డిఐజి, విశాఖపట్నం, గుంటూరు రేంజ్ డిఐజి, కర్నూల్ రేంజ్ డీఐజీ మరియు అనంతపురం రేంజ్ డీఐజీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు డిజిపి మాట్లాడుతూ

రేంజ్ పరిధిలో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్.ఎస్.ఐ లు వారి యొక్క వివరాలను గురించి, డిప్యుటేషన్ పై విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్.ఎస్.ఐ లు ఇతర విభాగాల సిబ్బంది గురించి విచారించారు. 
ఏలూరు రేంజ్ పరిధిలో నుండి సిఐలు ఎస్ఐలు ఆర్ ఎస్ ఐ లు ఇతర డిపార్ట్మెంట్ లకు డిప్యుటేషన్ పై

వెళ్ళుటకు నిరాకరించినటువంటి వారి వివరములు గురించి, లా అండ్ ఆర్డర్ లో  కాకుండగా ఇతర విభాగాలలో   సి ఐ, ఎస్ ఐ,ఆర్ ఎస్ ఐ లకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని సమాచారం గురించి  డీజీపీ గారు డి.ఐ.జి లను వీడియో కాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్ లో డిజిపి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి

ఉన్నందున, ఎవరు వేకెన్సీ రిజర్వులో ఉండకుండా చూడాలని, సిఐలు, ఎస్ఐలు, ఆర్.ఎస్.ఐ లు ప్రతి ఒక్కరూ ప్రమోషన్ పొందినప్పుడు తప్పనిసరిగా  ఇతర విభాగాలలో రెండు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితి లో ఉద్యోగ నిర్వహణ చేయాలని, 2011 నుండి 2020 వరకు ఇతర విభాగాలలో ఉన్న ఖాళీలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

ఏలూరు రేంజ్ డీఐజీ  కె వి మోహనరావు మాట్లాడుతూ ఏలూరు రేంజ్ లో  లా అండ్ ఆర్డర్ లో  సిఐ  162 మంది ఉన్నట్లు, డిప్యుటేషన్ లో 104 మంది ఉన్నట్లు ఇంకా 5 ఖాళీగా ఉన్నట్లు, లా అండ్ ఆర్డర్ లో  ఎస్ఐ  462 మంది ఉన్నట్లు, డిప్యుటేషన్ లో 111 మంది ఉన్నట్లు,  81 మంది అర్.ఎస్. ఐ లు ఉన్నట్లు, డిప్యుటేషన్ లో 24 మంది ఉన్నట్లు ఇంకా 5 ఖాళీగా ఉన్నట్లు,

ఏ.అర్.ఎస్. ఐ  లు 207  మంది ఉన్నట్లు, డిప్యుటేషన్ లో 06 మంది ఉన్నట్లు ఇంకా 02 ఖాళీగా ఉన్నట్లుగా తెలియ చేసారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో లా అండ్ ఆర్డర్ ఐ. జి  ఏ రవి శంకర్, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డ,  రేంజిలో ఇతర డీఐజీలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam