DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల  23 నుంచి 27 వరకు ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 22, 2020 (డి ఎన్ ఎస్):* ఈ నెల 23 నుంచి 27 వరకు ఎంసెట్​ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి ఎంసెట్​ కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్​లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీలో

ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు.

ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ ప్రకటించారు. ఎంసెట్​ 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంసెట్​ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు, సీట్ల

కేటాయింపు తేదీలు త్వరలో ప్రకటిoచనున్నారు.

ఏపీ ఎంసెట్​ 2020 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in ద్వారా​ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్‌) వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 1,200, ఎస్సీ, ఎస్టీ

విద్యార్థులు రూ.600 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీనిని http://apeamcet.nic.in ద్వారా చెల్లించవచ్చు.వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది.

 కౌన్సెలింగ్ తేదీ ర్యాంకులు 

అక్టోబరు 23    1 నుంచి 20,000
అక్టోబరు 24    20,001 నుంచి 50,000
అక్టోబరు 25    50,001 నుంచి 80,000
/> అక్టోబరు 26    80,001 నుంచి 1,10,000
అక్టోబరు 27    1,10,001 నుంచి చివరి ర్యాంకు వరకు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam