DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జెమ్స్ ఆస్పత్రి లో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభం.

(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)  

శ్రీకాకుళం, నవంబర్ 07,2020  (డి ఎన్ ఎస్):   రాగోలు లో గల జెమ్స్ ఆస్పత్రి నందు సూపర్ స్పెషాలిటీ విభాగం అత్యాధునికంగా  నూతనంగా నిర్మించిన సందర్భంగా   ముఖ్య అతిధిగా  జిల్లా కలెక్టర్ జె నివాస్  రిబ్బన్ కట్ చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విభాగాన్ని  

ప్రారంభించారు. తదుపరి విశిష్ట అతిధిగా  జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్  పాల్గొని  విడిఆర్ఎల్  లాబ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.మరో విశిష్ట అతిధి గా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అంకాలజీ విభాగాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ అన్ని వార్డులు తిరిగి వాటి

పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు లేక రోగులు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని,ఇకముందు ఆ అవసరం ఉండకుండా మన జిల్లా ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రయత్నించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు.  ఈ కార్యక్రమ అనంతరం 19 మంది గర్భిణీ స్త్రీలకు 20 రకాలతో కూడిన రేషన్ సామాన్ల కిట్ అధికారులు

చెతులమీదుగా  వారికి అందజేశారు .ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఏఓ రామ్మోహన్, డాక్టర్ గూడేన సోమేశ్వరరావు ఎండి  కిమ్స్ ఆసుపత్రి, డాక్టర్ లక్ష్మీ లత ప్రిన్సిపాల్, డాక్టర్ కళ్యాణ్ సుపరెంటెండెంట్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎంఓ, డాక్టర్ బాలమురళి ఆర్ఎంఓ, తడితరులు  పాల్గొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam