DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళంలో పోలీసు జాగిలాలు కెన్నెల్ భవనం ప్రారంభం.

(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)  

శ్రీకాకుళం, నవంబర్ 09, 2020  (డి ఎన్ ఎస్): శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్  కార్యాలయ మైదానం లో పోలీసు జాగిలాలకై నూతన భవనం పోలీసు కెన్నెల్ (డాగ్స్) భవనంను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు. ఎస్పీ సంప్రదాయబద్దంగా విఘ్నేశ్వరుని

పూజించి, శిలాఫలకం ను ఆవిష్కరించారు, అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన భవనం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల విధి నిర్వహణలో భాగంగా నేరము, నేరస్తులను కనిపెట్టుటలో పోలీస్ జాగిలాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. నేర శోధన మరియు రెస్క్యూ డాగ్‌లు ప్రత్యేకమైన ఖచ్చితత్వంతో పనిని పూర్తి

చేయగలవని,పేలుడు పదార్థాలు మరియు అక్రమ మాదకద్రవ్యాల రవాణా వంటివి పసిగట్టిటిలొ ఎంతో చురుకైన పాత్ర పోషిస్తుయి అని తెలిపారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు మొదలగు ప్రజా సమొహం ఉన్న చోట ఉగ్రవాదులు, తీవ్రవాదులు మొదలైన సంఘ విద్రోహ వ్యక్తులు ప్రజా ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిటట్లు అమర్చిన

పేలుడు పదార్థాలు కనిపెట్టేటలో కీలక పాత్ర పోషించి పోలీసు శాఖకు మెరుగైన సేవలు అందిస్తున్నయిని మరియు వి.ఐ. పి, వి.వి.ఐ.పిల పర్యటనలో, బహిరంగ సభలో అనుమాన్పు పేలుడు పదార్థాల గుర్తించాటలో ఈ పోలీసు డాగ్ లు మంచి ఫలితాలుస్తాయని అన్నారు. సైనిక కుక్కలు తమ హ్యాండ్లర్లుని మరియు సిబ్బందిని ప్రమాదం నుండి రక్షించడానికి,

ల్యాండ్‌మైన్‌లను శోధించుటలో కూడా తగు పాత్ర పోషిస్తాయని కొనియాడిరు.పోలీసులు డాగ్‌లు యొక్క పనితీరును పరిశీలించి వాటి ఆరోగ్య పరిరక్షణ, శిక్షణా విషయం పై ప్రేత్యేక శ్రద్ధ వహించాలని హ్యాండ్లెర్స్ కి తగు సూచనలు చేసారు.  

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ  (అడ్మిన్ ) పి సోమశేఖర్, అదనపు ఎస్పీ (క్రైమ్) టి.పి.

విఠలేశ్వరరావు, అదనపు ఎస్పీ (SEB) కె. శ్రీనివాసరావు, డిఎస్పీలు మూర్తి, ఎన్.ఎస్.ఎస్ శేఖర్, సిఐ చంద్రశేఖర్, ఆర్ఐ ప్రేదిపు మరియు ఎచ్చెర్ల ఎస్సై రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam