DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఎస్వీబీసీలో భక్తి తో పాటు రక్తి చిత్రాల వెబ్ ‌సైట్‌ లింక్‌ కలకలం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 11, 2020  (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది హిందూ భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహణలో సాగుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ లో సిబ్బంది దిగజారుడు తనం కారణం నీలి చిత్రాల వెబ్ సైట్ లింక్ లను భక్తుల పంపడం కలకలం

రేగింది. శుభాకాంక్షలు తెలిపే శతమానంభవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి తిరిగి ఎస్వీబీసీ ఉద్యోగి పొర్న్‌సైట్‌ వీడియో పంపాడు. దీంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఛైర్మన్‌, ఈవో తీవ్రంగా స్పందించాడు. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ

విజిలెన్స్‌, సైబర్‌క్రైమ్‌ టీమ్ తనిఖీలు చేపట్టింది. పొర్న్‌సైట్‌ వీడియో పంపిన ఉద్యోగితో పాటు.. కార్యాలయంలో పొర్న్‌సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు. అటెండర్‌ ఆనంద్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్‌క్రైమ్‌ అధికారులు గుర్తించారు.

దీంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam