DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ స్పెషల్ సెల్ ప్రారంభం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 17, 2020  (డి ఎన్ ఎస్):* సమస్యలలో ఉన్న స్త్రీలు మరియు పిల్లల కోసం 1800, 425, 2908 అనే హెల్ప్ లైన్ స్థాపించబడినది. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఈ సంస్థ గత 25 సంవత్సరాలుగా హైదరాబాదు నుండి ఇ సేవలు అందించు చున్నది. మన రాజమహేంద్రవరం లో సపోర్ట్ సెంటర్ ద్వారా 2017 నుండి తమ

సేవలను  అందించుచున్నది. మంగళవారం  దేవి చౌక్ నందు రెయిన్బో కలర్ ల్యాబ్ స్టూడియో పైన రెండవ అంతస్తులో భూమిక ఆఫీసును నూతనంగా ప్రారంభించినది. ప్రారంభోత్సవం డి ఎల్ ఐ సి లీగల్ సెల్ సెక్రెటరీ న్యాయమూర్తి K.V.L.హిమబిందు గారు  రు చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ భూమిక సపోర్ట్

సెంటర్ కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఈ సంస్థ వారు తమ దగ్గరకు వచ్చే  ఎటువంటి సమస్యతో వచ్చిన ముఖ్యంగా స్త్రీలు, బాలికలకు సంబంధించిన ఎటువంటి సమస్యకైనా వచ్చిన తమ సేవలు అందించుటకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. హింసలేని సమాజాన్ని నిర్మించటం అనే గొప్ప ఉద్దేశంతో ఈసంస్థ వారు అనునిత్యం

పరితపిస్తూ ఉంటారు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలని తద్వారా హింసలేని సమాజాన్ని నిర్మించవచ్చు అని వీరి స్లోగన్ ల ద్వారా గ్రహించవచ్చు అన్నారు. పిల్లలకు సంబంధించిన హక్కులను గుర్తుచేస్తూ ప్రతి పిల్లలు తమ హక్కులను పూర్తిగా వినియోగించుకోవడానికి ఈ సంస్థ వారు ఎంతో గా కృషి చేస్తున్నారన్నారు అవగాహన

కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం కలుగజేస్తున్న మన్నారు అదేవిధంగా లైంగిక హింస దానినీ ఎలా అరికట్టాలి అని స్త్రీలకు మరీ ముఖ్యంగా సమస్యల్లో ఉన్న స్త్రీలకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సపోర్ట్ సిస్టమ్స్ వివరిస్తూ ఆ వనరులను ఉపయోగించటం సమస్య నుండి బయటపడే మార్గాలు సూచిస్తున్న మన్నారు. నిస్వార్ధంగా

ఇన్ని సేవలను అందిస్తున్న మన రాజమండ్రి స్పెషల్ సెల్ భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వారికి అభినందనీయమని ధన్యవాదాలు అని వారి చేపడుతున్న మంచి కార్యక్రమాలు నిర్విరామంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వీరు పని చేస్తున్న 3 కమ్యూనిటీ లలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఒకటి సీతంపేట రెండు

అన్నపూర్ణమ్మ పేట మరియు మూడు క్వారీ పేట ఏరియాలలో స్త్రీలు మరియు పిల్లలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యం తీసుకు వస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమాలలో ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రశాంతి, సత్యవతి, భూమిక టీం, డిస్టిక్ లీగల్ సెల్ సర్వీస్ అధారిటీ న్యాయమూర్తి కె వి ఎల్ హిమ బిందు, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ పద్మావతి,

అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, పార డైరెక్టర్ వరల్డ్ విజన్ మరియు కొన్ని ఎన్జీవోస్ కమ్యూనిటీ వాలంటీర్లు సచివాలయం మహిళ పోలీసులు తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam