DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ లేఅవుట్‌ల పై నిబంధనలు ఖచ్చితంగా అమలు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 19, 2020  (డి ఎన్ ఎస్):* అక్రమ లేఅవుట్‌ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయితీరాజ్‌ కమీషనర్‌ కార్యాలయంలో అన్ని జిల్లాల డిపివోలు, జెడ్పీ సీఈవోలతో మంత్రి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమావేశానికి పంచాయితీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు సూచనలు చేసారు.

– అక్రమ

లేఅవుట్‌ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి

– అక్రమ లేఅవుట్‌ల అనుమతుల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాలి

– కొత్త అక్రమ లేఅవుట్‌లకు అప్రూవల్‌ ఇవ్వద్దు

– గ్రౌండ్‌ లెవల్‌లో ప్రధానంగా డిపివోలు, సీఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలి

– టీడీపీ హయాంలో

లేఅవుట్‌లు పెద్ద వ్యాపారంగా చేశారు కానీ మన ప్రభుత్వంలో అలా జరగకూడదు

– మున్సిపాలిటీలు, మేజర్‌ పంచాయితీలలో లేఅవుట్‌లు లీగల్‌గా ఉన్నాయో లేదో పరిశీలించాలి

– వారంలో ఒక రోజు కానీ 15 రోజులకోసారి వీటిపై సమీక్ష జరిపి అక్రమ లేఅవుట్‌లు లీగలైజ్‌ చేయాలి

– హౌస్‌టాక్స్‌లు వసూలు కూడా

అనుకున్న విధంగా రావడం లేదు, వీటిపై దృష్టి పెట్టాలి

– గ్రామ పంచాయితీలు సొంతంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి

– ర్యాండమ్‌గా తనిఖీలు చేయండి

– శానిటేషన్, డ్రింకింగ్‌ వాటర్‌కు ఇచ్చే నిధులు సరిగా వాడుతున్నారా లేదా తనిఖీలు చేయండి

– తాగునీరు,

పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

– డిసెంబర్‌ 2 నుంచి 21 వరకు శానిటేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమంపై దృష్టి పెట్టాలి

– గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి, డిపీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలి

– కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలలో నిధులు నిర్ణీత

గడువులోగా ఖర్చు పెట్టాలి

– పంచాయితీరాజ్‌ ఉద్యోగులు అందరూ నిబద్దతతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి

– గ్రామ సచివాలయ వ్యవస్ధలో పనిచేస్తున్న ఉద్యోగుల అటెండెన్స్, సేవలపై దృష్టి పెట్టాలి

– గ్రామ సచివాలయాలను పటిష్టం చేయాలి

– ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామ

సచివాలయ వ్యవస్ధ రాష్ట్రంలో ఉంది, అందరూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలి

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam